Urvashi Rautela : ఫ్యాషన్ పేరుతో జాతీయ పతాకాన్ని అవమానిస్తారా? ఉర్వశి రౌతేలా త్రివర్ణ గౌన్‌పై దుమారం !

 Urvashi Rautela : ఫ్యాషన్ పేరుతో జాతీయ పతాకాన్ని అవమానిస్తారా? ఉర్వశి రౌతేలా త్రివర్ణ గౌన్‌పై దుమారం !

బాలీవుడ్ బోల్డ్, గ్లామరస్ బ్యూటీ ఉర్వశి రౌతేలా ఎక్కడుంటే అక్కడ చర్చలు, వివాదాలు కామన్. లేటెస్ట్ గా ఈ ముద్దుగుమ్మ జైపూర్ వేదికగా జరిగిన 'మిస్ యూనివర్స్ ఇండియా 2026' ( Miss Universe India 2026 ) గ్రాండ్ ఫినాలేలో జ్యూరీ మెంబర్‌గా మెరిసింది. అయితే ఇక్కడ ఆమె తన దేశభక్తిని ఫ్యాషన్‌తో మిక్స్ చేస్తూ వేసుకున్న త్రివర్ణ గౌన్ కెమెరాలన్నింటినీ తనవైపు తిప్పుకుంది. ప్రస్తుతం ఆమె కాస్ట్యూమ్‌ నెట్టింట పెద్ద తుఫానే సృష్టిస్తోంది..

ఈ ఈవెంట్ కోసం ఉర్వశి ప్రత్యేకంగా డిజైన్ చేయించిన 'భారత త్రివర్ణ పతాకం' కాన్సెప్ట్ డ్రెస్‌లో ఎంట్రీ ఇచ్చింది. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల కాంబినేషన్‌తో పాటు అశోక చక్రం థీమ్‌ను ప్రతిబింబించే బ్లూ మోటిఫ్‌తో ఉన్న ఈ లాంగ్ గౌన్‌తో ఆమె వేదికపై సందడి చేసింది. 'నేనే ఇండియా.. నా దేశభక్తిని చాటుకోవడానికే ఈ త్రివర్ణ వస్త్రాన్ని ధరించాను' అని ఆమె గర్వంగా చెప్పుకొచ్చింది. 

అయితే నెటిజన్లు మాత్రం ఆమె లుక్‌పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. నీ 'గ్లామర్ షో కోసం జాతీయ పతాకం షేడ్స్‌ను, ఆకారాన్ని వాడి అవమానిస్తారా? ఇది అస్సలు సహించరానిది' అంటూ తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. ఇక ఈ ఈవెంట్‌లో ఉర్వశి తన మొదటి గురువు, మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్‌తో కలిసి జ్యూరీ ప్యానెల్‌ను పంచుకుంది. దశాబ్దం కిందట తనకు కిరీటం తొడిగిన సుస్మిత పక్కన మళ్లీ ఇలా నిలబడటం ఎంతో గర్వంగా ఉందంటూ భావోద్వేగానికి లోనైంది. 

ఈ రచ్చ అంతా ఒకెత్తయితే, ఈ పోటీల్లో కేరళకు చెందిన కాజియా లిజ్ మెజో మిస్ యూనివర్స్ ఇండియా 2026 విజేతగా నిలిచింది. దీంతో ఇప్పుడు ఆమె అంతర్జాతీయ వేదికపై భారత్ తరఫున పోటీపడే అవకాశాన్ని దక్కించుకుంది. ఏది ఏమైనా, తన ఫ్యాషన్ ఛాయిస్‌తో మరోసారి నేషనల్ వైడ్‌గా హాట్ టాపిక్‌గా మారింది ఉర్వశి.