డ్రస్సు ఖరీదు 20లక్షలా?.. అందులో అంత స్పెషల్ ఏంటి

డ్రస్సు ఖరీదు 20లక్షలా?.. అందులో అంత స్పెషల్ ఏంటి

ఊర్వశి రౌతేలా.. ప్రస్తుతం టాలీవుడ్ ని ఓ ఊపు ఊపేస్తోంది ఈ బాలీవుడ్ బ్యూటీ. మెగాస్టార్‌ చిరంజీవి నటించిన సూపర్ హిట్ మూవీ వాల్తేరు వీరయ్యలోని బాస్ పార్టీ సాంగ్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఈ సాంగ్ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇక తాజాగా అక్కినేని అఖిల్ హీరోగా వచ్చిన ఏజెంట్‌ మూవీలో ఓ ప్రత్యేక సాంగ్‌లో మెరిసింది. స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలోని వైల్డ్ సాలా అంటూ సాగిన ఆ పాటలో ఊర్వశి స్టెప్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మాస్ ఆడియన్స్ ఫుల్ ఫిదా చేసిన ఈ సాంగ్.. యూ ట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతోంది.

అయితే.. ఈ సాంగ్ లో ఊర్వశి రౌతేలా ధరించిన డ్రెస్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అదేంటంటే.. ఈ పాటలో ఆమె ధరించిన డ్రెస్ ఖరీదు అక్షరాల రూ.20 లక్షలత. ఊర్వశి కోసం ఆ డ్రస్ ను ప్రత్యేకంగా డిజైన్ చేయించారట మేకర్స్. న్యూయార్క్ రెట్రో ఫ్రెట్ బ్రాండ్ లో ఊర్వశి లుక్ చూసిన ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారట. ఏజెంట్ మూవీలో హీరోయిన్ గా నటించిన సాక్షి వైద్యకి ఎంత ఫెమ్ వచ్చిందో తెలియదు కానీ.. కేవలం ఒకే ఒక్క సాంగ్ చేసి ఫుల్ పాపులర్ అయ్యింది ఊర్వశి.