న్యూ ఏజ్ హార‌‌ర్ థ్రిల్లర్‌‌గా ‘ఉర్వి’

న్యూ ఏజ్ హార‌‌ర్ థ్రిల్లర్‌‌గా ‘ఉర్వి’

మహేష్‌‌(Mahesh), శృతి శంకర్(Shurthi shankar) ప్రధానపాత్రల్లో వై.కిరణ్(Y Kiran) దర్శకత్వంలో ల‌‌య‌‌న్ గిరి ప‌‌య్యావుల నిర్మిస్తున్న చిత్రం ఉర్వి(Urvi). ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ శుక్రవారం ప్రసాద్ ల్యాబ్స్‌‌లో జరిగింది. నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్, నవీన్ యాదవ్ ముఖ్య​ అతిథులుగా హాజరై సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు. అనంతరం నిర్మాత గిరి మాట్లాడుతూ ‘ఇదొక న్యూ ఏజ్ హారర్ థ్రిల్లర్. ప్రారంభం నుండి క్లైమాక్స్‌‌ వ‌‌ర‌‌కూ చాలా ఉత్కంఠగా ఉంటుంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.

ఫిబ్రవరి 2న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. హీరో మహేష్ మాట్లాడుతూ ‘ఒక మంచి హారర్ కాన్సెప్ట్‌‌తో ఈ మూవీ చేశాం. టీమ్ అంతా కొత్త వాళ్లం. మా అందరికీ బెస్ట్ డెబ్యూ మూవీ అవుతుందని నమ్ముతున్నాం’ అన్నాడు. ‘ప్రస్తుత సమాజంలో జరుగుతున్న ఓ అంశాన్ని తీసుకుని తెలంగాణ బ్యాక్‌‌డ్రాప్‌‌లో ఈ సినిమా తీశాం. చాలా ఇంటరెస్టింగ్‌‌గా ఉంటుంది’ అని చెప్పాడు. సంగీత దర్శకుడు లక్ష్మణ సాయి తదితరులు పాల్గొన్నారు.