అమెరికా ఇండియాను ప్రేమిస్తుంది: ట్రంప్

అమెరికా ఇండియాను ప్రేమిస్తుంది: ట్రంప్

న్యూఢిల్లీ: అమెరికా ఇండియాను ప్రేమిస్తుందని అగ్రదేశ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నారు. యునైటెడ్ స్టేట్స్ ఇండిపెండెంట్ డే సందర్భంగా విషెస్ చెప్పిన ఇండియా ప్రధాని నరేంద్ర మోడీకి ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు థ్యాంక్యూ మై ఫ్రెండ్, అమెరికా లవ్స్ ఇండియా అని ట్రంప్ ట్వీట్ చేశారు.

శనివారం ఓ పొలిటికల్ ర్యాలీలో  భాగంగా ట్రంప్ మాట్లాడుతూ.. శత్రువుల నుంచి తమ దేశ విలువలను కాపాడుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. లెఫ్టిస్ట్‌లు, దోపిడీదారులు, ఆందోళనకారుల నుంచి విలువలను  రక్షించుకోవాలని ట్రంప్ పేర్కొన్నారు. కరోనా మహమ్మారిపై యుద్ధంలో ముందుండి పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వర్కర్స్ అయిన మెడికల్ సిబ్బందికి ట్రంప్ అభినందనలు  తెలిపారు. అలాగే తనపై అపవాదు మోపడంతోపాటు దేశ గతాన్ని అగౌరవపరుస్తున్న వారిపై మండిపడ్డారు.