ప్రధాని మోడీజీ..మీరు చాలా గ్రేట్

ప్రధాని మోడీజీ..మీరు చాలా గ్రేట్

అడిగింది ఇస్తు న్నడు.. మోడీ చాలా గ్రేట్ హైడ్రాక్సిక్లోరోక్విన్ కావాలని ఇట్లా అడిగానో లేదో.. అట్ల మోడీ ఒప్పుకున్నడు. మేమిద్దరం మంచి దోస్తులం. అందుకే, ఎగుమతులపై విధించిన బ్యాన్ను ఎత్తేసి మరీ ఈ మందును పంపించేందుకు సరే అన్నడు. మోడీ చాలా గ్రేట్. – అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్

మలేరియా మందు హైడ్రాక్సిక్లోరోక్వి న్ ఎగుమతికి ఒప్పుకున్న ప్రధాని నరేంద్ర మోడీ ‘గ్రేట్’ అంటూ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్  మెచ్చుకున్నరు. కరోనా దెబ్బకు అమెరికాలో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నరని, ఈ మందుతో మరణాలను తగ్గించువచ్చని చెప్పారు. ఈ వైరస్ కు అందిస్తున్న ట్రీట్మెంట్లో హైడ్రాక్సిక్లోరో క్విన్ మందు బాగా పనిచేస్తుందని సైంటిస్టులు చెప్పారు. ట్రంప్ కూడా గతంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఫలితాలు బాగున్నాయని తేలడంతో హైడ్రాక్సిక్లోరోక్విన్ మందుకు గిరాకీ ఏర్పడిం ది . మన దేశంలో కూడా కరోనా బాధితులు ఉండడంతో ప్రభుత్వం అప్రమత్తమై హైడ్రాక్సి క్లోరోక్విన్ ఎగుమతులపై బ్యాన్ విధించింది. ఆ మరుసటి రోజే తమకు ఈ మందు కావాలంటూ ప్రధాని మోడీకి ట్రంప్ ఫోన్ చేశారు. అమెరికాలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉందని, ఎగుమతులపై బ్యాన్ ఎత్తేసి తమకు సాయం చేయాలని కోరారు. ఈ విజ్ఞ ప్తికి సానుకూలంగా స్పందించిన ప్రధాని మోడీ.. హైడ్రాక్సిక్లోరోక్విన్ మందు ఎగుమతిపై విధించిన బ్యాన్ ను  తొలగించారు. దీంతో మన దేశం నుంచి 2 కోట్ల 90 లక్షల హైడ్రాక్సిక్లోరోక్వి న్ డోసులను అమెరికా కొనుగోలు చేసింది. ఈ డీల్ తర్వాత ట్రంప్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రధాని మోడీపై ప్రశంసలు గుప్పించారు. మోడీతో తనకు పర్సనల్ ఫ్రెండ్ షిప్ ఉందని, గతేడాది హ్యూస్ట న్లో జరిగిన ‘హౌడీ, మోడీ’ సభతో పాటు ఇటీవల అహ్మదాబాద్ లో జరిగిన నమస్తే ట్రంప్ సభ విశేషాలను ట్రంప్ గుర్తు చేసుకున్నారు.