ఓటీటీలోకి పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే?

ఓటీటీలోకి పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే?


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ప్రతిష్టాత్మక చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'.  భారీ అంచనాలతో  ఉగాది కానుకగా ( మార్చి 19, 2026) థియేటర్లలోకి ఎంట్రీ ఇచ్చింది.  'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి  కలయికతో ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అయితే ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. మిశ్రమ స్పందనను అందుకుంది. బాక్సాఫీస్ వద్ద  రూ. 100 కోట్ల కూడా రాబట్టలేకపోయింది. 

OTT విడుదల ఎప్పుడు?

ఈ సినిమా థియేటర్లలో రచ్చ చేస్తుండగానే, దీని డిజిటల్ పార్ట్నర్ గురించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. నిర్మాత నవీన్ యెర్నేని గతంలో తెలిపిన వివరాల ప్రకారం స్ట్రీమింగ్ ఏప్రిల్ 24, 2026 ఉండే అవకాశం ఉంది. సాధారణంగా సినిమా విడుదలైన 5 వారాల తర్వాత మాత్రమే ఓటీటీలోకి వస్తుంది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

మిశ్రమ స్పందన.. 

'ఉస్తాద్ భగత్ సింగ్' పై సోషల్ మీడియాలో టాక్ కూడా కాస్త భిన్నంగా ఉంది. ఒక వర్గం ప్రేక్షకులు "వింటేజ్ పవన్ కళ్యాణ్ ఈజ్ బ్యాక్" అని, ఈ దశాబ్దపు బెస్ట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ అని కొనియాడుతున్నారు. అయితే, మరికొందరు కథలో కొత్తదనం లేదని, సీన్లు కేవలం అభిమానులను అలరించడానికే పేర్చినట్లు ఉన్నాయని పెదవి విరుస్తున్నారు. అయినప్పటికీ, పవన్ మేనరిజమ్స్ , హరీష్ శంకర్ డైలాగులు మాస్ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పిస్తాయని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

ధురంధర్ 2 తో బాక్సాఫీస్ పోరు

పవన్ కళ్యాణ్ సినిమాకు ఈసారి గట్టి పోటీ ఎదురవుతోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పై థ్రిల్లర్ 'ధురంధర్ 2' తో ఉస్తాద్ పోటీ పడుతోంది. ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో భారీగా విడుదల కావడంతో బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పోరు నెలకొంది. ఉస్తాద్ భగత్ సింగ్ వసూళ్లపై కూడా గట్టి ప్రభావం చూపిస్తోందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సినీ ప్రియులను థియేటర్లకు రప్పించి కలెక్షన్స్ ను పెంచేందుకు మేకర్స్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రమోషన్స్ స్పీడప్ చేశారు. 

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన  శ్రీలీల, రాశీ ఖన్నా  నటించారు.. కె.ఎస్. రవికుమార్, గౌతమి, రావు రమేష్ వంటి సీనియర్ నటులు కీలక పాత్రలు పోషించారు.   దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ మూవీపై మిశ్రమ స్పందన, విమర్శలు ఎలా ఉన్నా 'ఉస్తాద్ భగత్ సింగ్' వసూళ్ల పరంగా బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా థియేటర్స్ ను వీడి నెట్‌ఫ్లిక్స్‌లో  స్ట్రీమింగ్ కావాలంటే నెల రోజులు పడుతుంది. మరి ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయాలంటే అప్పటి వరకు వేచి చూడాల్సిందే.