‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు తాము ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వస్తోందని టీమ్ చెప్పింది. పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం ఉగాది కానుకగా గురువారం విడుదలైంది. మొదటి షో నుంచే అన్ని ప్రాంతాల నుంచి అద్భుతమైన స్పందనను సొంతం చేసుకుందని చెప్పిన టీమ్ తమ ఆనందాన్ని వ్యక్తం చేసింది.
ఈ సందర్భంగా దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ ‘ఇదొక మాస్ ఎంటర్‌టైనర్ కాబట్టి, ఓవర్సీస్ నుంచి పాజిటివ్ టాక్ రావడానికి కొంచెం సమయం పడుతుందని అనుకున్నా. కానీ, మొదటి షో నుంచే అన్ని ప్రాంతాలలో పాజిటివ్ టాక్ రావడం ఆనందంగా ఉంది. కమర్షియల్ సినిమా అయినప్పటికీ ఇందులో కొన్ని మంచి అంశాలు చూపించాం’ అని చెప్పాడు.
థియేటర్స్ దగ్గర పండగ వాతావరణం కనిపిస్తోందని, షో షోకి టాక్‌తోపాటు కలెక్షన్స్ పెరుగుతున్నాయని నిర్మాతలు అన్నారు. ఈ సక్సెస్‌లో భాగమవడం ఆనందంగా ఉందని ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, గీత రచయిత చంద్రబోస్ అన్నారు.
