పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్ ' ట్రైలర్ వచ్చేసింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీపై ఇప్పటికే అంచనాలు తారా స్థాయికి చేశారు. లేటెస్ట్ గా ( మార్చి 14, 2026 ) మేకర్స్ విడుదల చేసిన ట్రైలర్ అభిమానులను అంచనాలను మరింత పెంచేసింది. మార్చి 19న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ మూవీ టీజర్, మూడు పాటలు ఆకట్టుకున్నాయి. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ పవన్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తున్నాయి. గతంలో పవన్ , హరీష్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
గ్రాండ్ గా ప్రీరిలీజ్..
ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడటంతో మేకర్స్ ప్రమోషన్స్ స్పీడప్ చేశారు. గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ రేపు ( మార్చి 15 ) సాయంత్రం హైదరాబాద్, యూసుఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్ లో జరగనుంది.ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు చిత్ర నటీనటులు, సిబ్బంది హాజరు కానున్నారు. ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేశారు. 'ఓజీ' తర్వాత అభిమానుల కోసం మరో బిగ్గెస్ట్ ఈవెంట్ ఇది.
►ALSO READ | Sreeleela: ఆకుపచ్చ చీరలో శ్రీలీల మెరుపులు.. 'రామ్ పరివార్' నెక్లెస్ ఫోటోలు వైరల్..!
టికెట్ ధరల పెంపునకు ఏపీలో గ్రీన్ సిగ్నల్
'ఉస్తాద్ భగత్ సింగ్ ' మూవీ టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 19వ తేదీ తెల్లవారుజామున 4 నుంచి 5 గంటల మధ్యలో ఈ బెనిఫిట్ షో ప్రదర్శించుకోవచ్చని తెలిపింది. టికెట్ ధరను పన్నులతో కలిపి రూ. 500 గా నిర్ణయించింది. ఈ టికెట్ రేట్లను పది రోజుల పాటు అమలులో ఉంటాయి . మల్టీ ప్లెక్స్ లలో రూ. 125 , సింగ్ స్క్రీన్ లలో రూ. 100 , చొప్పున పెంచుకునేలా అవకాశం ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. అయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతి రావాల్సి ఉంది.
రన్ టైం ఎంతంటే..
ఈ చిత్రానికి సెన్సారో బోర్డ్ 'యూ/ఏ' (U/A) సర్టిఫికేట్‌ను జారీ చేసింది. మొత్తం రన్ టైం 2 గంటల 34 నిమిషాలు. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల, రాశి ఖన్నా నటించారు.. అలాగే ఆర్. పార్థిబన్, అశుతోష్ రాణా, గౌతమి, నాగ మహేష్ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించింది. హరీష్ శంకర్ మార్క్ డైలాగ్స్, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, తమన్ బీజీఎం, దశరథ్ స్క్రీన్‌ప్లే ఈ సినిమాకు ప్రధాన బలాలుగా నిలవనున్నాయి. మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి మరి.
