ఉత్సవం మూవీ టీజర్ రిలీజ్.. ఉత్సవంలా ఉంటుందట!

ఉత్సవం మూవీ టీజర్ రిలీజ్.. ఉత్సవంలా ఉంటుందట!

దిలీప్ ప్రకాష్(Dileep Prakash), రెజీనా కసాండ్రా(Regina Cassandra) ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం ఉత్సవం(Uthsavam). అర్జున్ సాయి(Arjun sai) దర్శకత్వంలో  సురేష్‌‌‌‌ పాటిల్‌‌(Suresh Patil) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  నాజర్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, అలీ, ప్రేమ, ఎల్బీ శ్రీరామ్, ఆమని  కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆదివారం ఈ మూవీ టీజర్‌‌‌‌ను రిలీజ్ చేశారు. అతిథిగా హాజరైన నిర్మాత ఏఎం రత్నం సినిమా సక్సెస్ కావాలని విష్ చేశారు. బ్రహ్మానందం మాట్లాడుతూ ‘ఇలాంటి సినిమాలు చేయాలంటే ధైర్యంతో పాటు సినిమాటిక్‌‌గా చెప్పే నేర్పు కావాలి.

ఇంతమంది నటీనటులని ఒక్క చోటికి చేర్చి చాలా అద్భుతంగా అర్జున్ సాయి ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. నిజంగా ఈ సినిమా 'ఉత్సవం'లా ఉంటుంది.  కచ్చితంగా  సూపర్ డూపర్ హిట్ అవుతుంది’ అని అన్నారు.  హీరో దిలీప్ మాట్లాడుతూ ‘కలర్‌‌‌‌పుల్, ఎమోషనల్ జర్నీ, కంటెంట్ బేస్డ్  సినిమాతో  పరిచయం కావడం గర్వంగా, గౌరవంగా ఉంది’ అని చెప్పాడు. దర్శకుడిగా రూపొందించిన తన తొలి చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నా అన్నాడు అర్జున్ సాయి. నటుడు ఎల్బీ శ్రీరామ్, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్,  లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.