చిరు..అఖిల్తో మూవీస్ చేస్తున్న..మరో బడా బ్యానర్

చిరు..అఖిల్తో మూవీస్ చేస్తున్న..మరో బడా బ్యానర్

ప్రసెంట్ టాలీవుడ్లో అయినా.. బాలీవుడ్లో అయినా ఒక సినిమా సక్సెస్ అయితేనే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పైన క్లారిటీ ఉంటుంది. స్టోరీలో కంటెంట్ ఉంటేనే సినిమాను సక్సెస్ చేస్తున్నారు ప్రేక్షకులు. లేటెస్ట్గా టాలీవుడ్లో రిలీజైన రెండు భారీ బడ్జెట్ మూవీస్..బాక్సాపీస్ వద్ద డిజాస్టర్గా నిలిచాయి. అఖిల్ ఏజెంట్ మూవీ, చిరంజీవి భోళా శంకర్ మూవీస్కి పెట్టిన బడ్జెట్లో కనీస వసూళ్లు సాధించలేకపోయాయి. దీంతో ఈ హీరోస్ తో వర్క్ చేయడానికి ప్రొడ్యూసర్స్ కాస్త ఆలోచిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. 

ఏజెంట్, భోళా శంకర్ మూవీస్ను నిర్మించింది ఏకే ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ అధినేత అనిల్ సుంకర. అయితే ఈ రెండు చిత్రాలు అనిల్ సుంకరకు భారీ నష్టాన్ని చేకూర్చాయి. లేటెస్ట్గా చిరు,అఖిల్ తమ కొత్త ప్రాజెక్ట్స్ గురుంచి ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. బింబిసార డైరెక్టర్ వశిష్ఠ డైరెక్షన్ లో వస్తున్న చిరంజీవి 157వ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మించనుంది. పంచభూతాల కాన్సెప్ట్ లో రిలీజైన పోస్టర్ కూడా బాగా ఆకట్టుకుంది. ఇక అఖిల్ నుంచి రాబోయే అఖిల్6 చిత్రాన్ని కూడా యూవీ క్రియేషన్స్ బ్యానరే నిర్మిస్తుంది.ఈ మూవీకి అనిల్​ కుమార్ అనే కొత్త డైరెక్టర్ వర్క్ చేస్తున్నాడట. 

చిరు, అఖిల్ రెండు ప్రాజెక్ట్స్ సోషియో ఫాంటసీ జోనర్ లోనే రాబోతున్నాయి. దీంతో ఈ ప్రాజెక్ట్స్ పైన ఇండస్ట్రీ అంతా మాట్లాడుకుంటుంది. ఎందుకంటే, ఇప్పటికే అనిల్ సుంకర భారీ నష్టాలను చూసిన హీరోస్ తో యూవీ క్రియేషన్స్ పెద్ద సాహసం చేయబోతోందని మాట్లాడుకుంటున్నారు.

ఇక చిరంజీవి,అఖిల్ ఎలాగైనా హిట్ కొడితేనే నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పైన అందరికీ కాన్ఫిడెన్స్ ఉంటుంది. వీరు ఎంచుకునే కథలో కంటెంట్ ఉంటే  ఆడియన్స్ తప్పక హిట్ చేస్తారు. కానీ ఎప్పటి లాగే రొటీన్ స్టోరీస్ తో వస్తే మాత్రం..అదే రిసల్ట్ వస్తుందని ఇండస్ట్రీ నుంచి టాక్ వినిపిస్తుంది.