న్యూఢిల్లీ: ఇంగ్లాండ్, ఐర్లాండ్ టూర్, ఆసియా గేమ్స్ 2026కు బీసీసీఐ భారత టీ20 జట్టును ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా ఎంపిక అయ్యాడు. తెలుగు కుర్రాడో తిలక్ వర్మకు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఐపీఎల్ 2026లో పరుగుల వరద పారించిన యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. తద్వారా అతి చిన్న వయసులో జాతీయ జట్టుకు ఎంపికైన భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును వైభవ్ బద్దలుకొట్టాడు.
సచిన్ 16 సంవత్సరాల 205 రోజుల వయసులో భారత్ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. వైభవ్ సూర్యవంశీ కేవలం 15 సంవత్సరాల 70 రోజుల్లోనే జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. సచిన్ కంటే ఏడాదిన్నర ముందే ఈ 15 ఏళ్ల బుడ్డోడు టీమిండియాలో చోటు దక్కించుకోవడం గమనార్హం. ఐపీఎల్లో వైభవ్ సిక్సర్ల సునామీ ఎంజాయ్ చేసిన ఫ్యాన్స్.. బుడ్డోడి విధ్వంసాన్ని బ్లూ జెర్సీలో చూడాలని ఉవ్విళ్లూరుతున్నారు.
ఐపీఎల్ 2026లో వైభవ్ ఊచకోత
ఐపీఎల్ 2026లో ధనాధన్ బ్యాటింగ్‌తో మెరుపులు మెరిపించిన యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించాడు. ఐపీఎల్ 2026లో బౌలర్లను ఊచకోత కోస్తూ 16 మ్యాచ్‌ల్లో 237.31 స్ట్రైక్ రేట్‌తో 72 సిక్సర్లు, 63 ఫోర్లతో 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ విజేతగా నిలిచాడు. తద్వారా అతి చిన్న వయసు (15 సంవత్సరాలు)లో ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. అంతేకాకుండా ఒకే ఐపీఎల్ సీజన్లో (59) అత్యధిక సిక్సర్లు కొట్టిన క్రిస్ గేల్ రికార్డును కూడా బద్దలుకొట్టాడు బేబీ యూనివర్సల్ బాస్.
ఇంగ్లాండ్ సిరీస్‌కి భారత టీ20 స్క్వాడ్:
శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, వైభవ్ సూర్యవంశీ, రవి బిష్ణోయ్, మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్
ఐర్లాండ్‌తో భారత్ టీ20 సిరీస్ స్క్వాడ్:
శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, వైభవ్ సూర్యవంశీ, రవి బిష్ణోయ్, మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్
ఏషియన్ గేమ్స్‌కి భారత టీ20 జట్టు:
శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, వైభవ్ సూర్యవంశీ, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి
ALSO READ : సూర్యకుమార్‌కు డబుల్ షాక్.. కెప్టెన్సీతో పాటు జట్టు నుంచి తప్పించిన బీసీసీఐ..
