OTT లోకి వైష్ణవ్ తేజ్ ఆదికేశవ..స్ట్రీమింగ్ ఎప్పుడు..ఎక్కడంటే?

OTT లోకి వైష్ణవ్ తేజ్ ఆదికేశవ..స్ట్రీమింగ్ ఎప్పుడు..ఎక్కడంటే?

మెగా హీరో వైష్ణవ్ తేజ్(Vaishnav Tej) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ఆదికేశవ(Aadikeshava). యంగ్ బ్యూటీ శ్రీలీల(Sreeleela) హీరోయిన్గా నటించిన ఈ మూవీని కొత్త దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి తెరకెక్కించాడు. 

ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‍ఫ్లిక్స్(Netflix) సొంతంచేసుకోగా..ఈ నెల డిసెంబర్ 22 నుంచి స్ట్రీమింగ్ కానుంది. నిజానికి ఆదికేశవ సినిమాను థియేటర్స్ లో చూడటానికి ఆడియన్స్ ఇష్టపడలేదు. దీంతో ఓటీటీ రిలీజ్ కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. మరి థియేటర్ లో ప్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

సితార ఎంటర్టైన్మెంట్ పై నాగవంశీ నిర్మించిన ఈ సినిమా నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అవుట్ అండ్ అవుట్ మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. రొటీన్ స్టోరీతో వచ్చిన ఈ సినిమాను ఆడియన్స్ రిజెక్ట్ చేశారు. దీంతో డిజాస్టర్ రిజల్ట్ ను దక్కించుకుంది ఈ మూవీ.

జీవి ప్రకాష్ అందించిన మ్యూజిక్ ఆకట్టుకుంది. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రాధికా శరత్ కుమార్, సుమన్, అపర్ణ దాస్, సదా, భోజు జార్జ్ ముఖ్య పాత్రల్లో నటించారు.