‘బేబీ’ సినిమాతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ వైష్ణవి చైతన్య. ఆ తర్వాత లవ్ మీ, జాక్, ఎపిక్ వంటి సినిమాలతో ప్రేక్షకులను పలకరించినా ఆశించిన విజయాలను అందుకోలేకపోయింది. దీంతో ఇప్పుడు ఈ బ్యూటీ కోలీవుడ్‌పై ఫోకస్ పెట్టింది. తమిళ హీరో ఆర్య సరసన ‘హలో కాదల్’ అనే రొమాంటిక్ కామెడీ సినిమాతో వైష్ణవి చైతన్య కోలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది.
మలయాళ దర్శకుడు నిఖిల్ మురళీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నిఖిలా విమల్ మరో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో వైష్ణవి మోడ్రన్ అమ్మాయిగా బోల్డ్ పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది. అంతేకాదు, ఈ సినిమా కోసం తమిళం నేర్చుకుని తన పాత్రకు తానే డబ్బింగ్ చెబుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఆర్య భార్య సయేషా నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి తమిళ చిత్రంతోనైనా వైష్ణవి చైతన్య విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి.
