బాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న వామిక గబ్బి.. ఇటీవల ‘పతి పత్ని ఔర్ ఓ దో’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. తను నటించే సినిమాల ఫలితం మాటెలా ఉన్నా, వామిక స్క్రీన్ ప్రెజెన్స్‌కు యూత్ ఫిదా అవుతున్నారు. దీంతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాలీవుడ్‌లో బిజీగా మారింది. మరోవైపు సౌత్‌లోనూ మరోసారి అదృష్టం పరీక్షించుకుంటోంది.
గతంలో ‘భలే మంచిరోజు’ అనే తెలుగు చిత్రంలో నటించిన ఆమె.. పదేళ్ల తర్వాత అడివి శేష్‌కు జంటగా ‘గూఢచారి’ సీక్వెల్ ‘జీ2’లో నటిస్తోంది. మరోవైపు ‘డిసి’ చిత్రంతో పదేళ్ల తర్వాత తమిళ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నాడు. అరుణ్ మాథేశ్వరన్ దీనికి దర్శకుడు. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది.
రెండు వారాల క్రితం విడుదలైన ట్రైలర్‌కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. డార్క్ అండ్ వైల్డ్ యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ చిత్రంలో గ్లామర్‌తో పాటు పెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న చంద్ర అనే క్యారెక్టర్‌లో వామిక నటించింది. ప్రమోషనల్ కంటెంట్‌లో తన లుక్, పోస్టర్స్ ఇంప్రెస్ చేస్తున్నాయి. ఈ చిత్రం తర్వాత సౌత్‌లోనూ ఆమె మరింత బిజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు తమిళంలో ఆమె నటించిన ‘జీనీ’ చిత్రం రిలీజ్ కావల్సి ఉంది.
