ఇదొక ప్రశ్ననా.. సురేష్ కొండేటి పై వరలక్ష్మి శరత్ కుమార్ ఫైర్

ఇదొక ప్రశ్ననా.. సురేష్ కొండేటి పై వరలక్ష్మి శరత్ కుమార్ ఫైర్

తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్(Varalakshmi sharathkumar) ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ మాన్షన్ 24(Mansion24). రాజు గారి గది చిత్రాల దర్శకుడు  ఓంకార్(Ohmkar) ఈ సినిమాను తెరకెక్కస్తున్నారు. సత్యరాజ్(Sathyaraj) కీ రోల్ చేస్తున్న ఈ సినిమా అక్టోబర్ 17 నుండి ప్రముఖ ఓటీటీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. టీజర్, ట్రైలర్ తో అంచనాలు పెంచేసిన ఈ సినిమా కోసం ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 

తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు చిత్ర యూనిట్. ఆ సందర్బంగా మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. రిపోర్టర్స్ అడిగిన ప్రశ్నలకు సమాదానాలు ఇచ్చారు. ఈ ప్రెస్ మీట్ లో మరోసారి తన వింత ప్రశ్నలతో వైరల్ అవ్యయారు జర్నలిస్ట్ సురేష్ కొండేటి. మీడియా ఇంటరాక్షన్ లో భాగంగా సురేష్ కొండేటి.. మీరు దెయ్యాలను నమ్ముతారా అని వరలక్ష్మినీ అడిగారు. దానికి సమాధానంగా వరలక్ష్మి నమ్ముతాను అని అడిగింది. అప్పుడు మళ్ళీ మైక్ తీసుకున్న సురేష్ కొండేటి.. దెయ్యాన్ని ఇష్టపడతారా? దేవుడైన ఇషపడతారా అంటూ అడిగారు. ఆ ప్రశ్నకు సహనం కోల్పోయిన వరలక్ష్మి.. దెయ్యాలను ఎవరండీ ఇష్టపడతారు. ఇది ఒక ప్రశ్ననా.. మీకు దెయ్యం అంటే ఇష్టంలా ఉంది ఆవును కదా.. అంది. దానికి మళ్ళీ మైక్ అందుకున్న సురేష్ కొండేటి.. మీ దర్శకుడు ఓంకార్ కి దెయ్యాలంటే ఇష్టం అందుకే ఇలాంటి సినిమాలు చేస్తున్నారు అన్నాడు. వెంతంటే మైక్ తీసుకున్న ఓంకార్ నేనెప్పుడూ అలా చెప్పాను సార్. అన్నీ మీకు మీరే అనుకుంటే ఎలా. నేను చెప్పానా దెయ్యం అంటే నాకిష్టమని అని.. అంటూ ఇండైరెక్ట్ గా సెటైర్ వేశాడు ఓంకార్. 

ఈ వీడియో చూసిన నెటిజన్స్ సురేష్ కొండేటిపై కెమెంట్స్ తో రెచ్చిపోతున్నారు. నువ్విక మారవా? అసలు ఇలాంటి అర్థంలేని ప్రశ్నలు ఎలా అడగాలనిపిస్తుంది మీకు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీనికి సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.