
వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటిలో పూజా వస్తువులను సరైన దిశలో ఉంచాలని పండితులు అంటున్నారు. . హిందూ మతంలో పూజ వస్తువులకు.. భగవంతుడిని ఆరాధించేందుకు పెద్దపీట వేస్తారు. అందుకే పూజా వస్తులను ఇంట్లో సరైన ప్రదేశంలో పెట్టుకోవాలి. వాస్తు ప్రకారం.. ఇంట్లో పూజా వస్తువులను ఎక్కడ పెట్టుకోవాలో తెలుసుకుందాం. .
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోని పూజకు ఉపయోగించే వస్తువులను అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పెట్టుకోవాలి. ఇంట్లో సరైన స్థలంలో .. సరైన దిశలో పూజవస్తువులను ఉంచితే శుభ ఫలితాలను తెస్తుంది. ఇంటికి ఆనందం, సుఖ శాంతులు లభిస్తాయి. కుటుంబ సభ్యులందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారు.
పూజా సామాగ్రిని ఏ దిశలో ఉంచకూడదు?
వాస్తు శాస్త్రం ప్రకారం... దక్షిణ దిశను యమరాజుకు చెందినది . అలాంటప్పుడు దక్షిణ దిశలో పూజకు సంబంధించిన వస్తువులను ఉంచడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తితో పాటు .. చెడు ప్రభావాలు పెరుగుతాయి. ఇంకా ఈ దిశలో పూర్వీకులు ఉంటారు. అందుకే పూజ వస్తువులను ఇక్కడ ఉంచితే కుటుంబ సభ్యులకు ఆరోగ్యం సమస్యలు వస్తాయి.
ఇంట్లో ఆగ్నేయ దిశలో.. బాత్రూమ్ దగ్గర పూజా సామాగ్రిని ఉంచకూడదు. ఆ ప్రదేశంలో పూజా వస్తువులను ఉంచితే ఇంట్లోకి ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది. అపవిత్రమైన ప్రదేశాల్లో ఉంచితే పూజా ద్రవ్యాల స్వచ్చత కోల్పోతాయి. ప్రధాన ద్వారం దగ్గర, మరుగుదొడ్డి దగ్గర, మెట్ల క్రింద ఎప్పుడూ పూజావస్తువులను ఉంచకూడదు. ఇలా ఉన్న ఇళ్లలో ఇది జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.
ఎక్కడ ఉంచాలి
పూజా వస్తువులను ఎల్లప్పుడూ సరైన దిశలో ఉంచాలి .. అప్పుడే శుభ ఫలితాలతో పాటు దేవతల ఆశీర్వాదాలను కూడా పొందుతారు. పూజ వస్తువులు తూర్పువైపే ఉండాలి. అలాగే పూజ చేసేటప్పుడు ముఖం తూర్పు దిక్కులో ఉండాలి. ఇలా పూజిస్తే సంతోషం .. అదృష్టం కలసి వస్తుంది. పడమర ముఖంగా పూజించడం వల్ల సంపద పెరుగుతుంది..సాధ్యమైనంత పూజ స్థలం ఈశాన్యంలోనే ఉండాలి. అలా కుదరని పక్షంలో ఒకవేళ మార్చుకుంటే పడమర వాయువ్యం వైపు పెట్టుకోవాలి.