మొదలైన వరుణ్-లావణ్య పెళ్లి సందడి.. సంగీత్ ఫొటోస్ వైరల్

మొదలైన వరుణ్-లావణ్య పెళ్లి సందడి.. సంగీత్ ఫొటోస్ వైరల్

టాలీవుడ్ లవ్ బర్డ్స్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej), లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) పెళ్ళికి సర్వం సిద్ధమైంది. నవంబర్ 1న వీరి వివాహ వేడుక  ఇటలీలో ఘనంగా జరుగనుంది. ఇప్పటికే మెగా, అల్లు, కామినేని, లావణ్య ఫ్యామిలీలు ఇటలీకి చేరుకున్నాయి. మొత్తం నాలుగు రోజుల పాటు ఈ పెళ్లి వేడుకలు జరగంనుందని సమాచారం.

ఇందులో భాగంగా.. అక్టోబర్ 30 నైట్ సంగీత్, కాక్ టైల్ పార్టీ నిర్వహించారు. దీనికి ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోస్ లో రామ్ చరణ్, ఉపాసన, అల్లు అర్జున్, స్నేహారెడ్డి, సాయి ధరమ్ తేజ్ ఉన్నారు. అనంతరం అక్టోబర్ 31 ఉదయం హల్దీ వేడుక, సాయంత్రం మెహందీ వేడుక జరుగనుంది. ఇక రేపు (నవంబర్1)న మధ్యాహ్నం 2 గంటల 48 నిమిషాల పెళ్లి జరుగనుంది.