ఘనంగా వరుణ్, లావణ్య ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్.. ఫొటోస్ షేర్ చేసిన మెగాస్టార్

ఘనంగా వరుణ్, లావణ్య ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్.. ఫొటోస్ షేర్ చేసిన మెగాస్టార్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) లావణ్య త్రిపాఠిని(Lavanya Tripathi) త్వరలో పెళ్లిచేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఈ జంటకు జూన్ 9న ఘనంగా నిశ్చితార్థం జరిగింది. దాదాపు ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట.. పెళ్లి విషయం ప్రకటించి అందరికీ షాకిచ్చారు. అప్పటి నుండి వీరి పెళ్లిపై వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి.

ఇటీవల తమ పెళ్లి బట్టలు డిజైనింగ్ కోసం ఫేమస్ డిజైనర్ మనీష్ మల్హోత్రా వద్దకు వెళ్లారు వరుణ్, లావణ్య. ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో.. వీరి పెళ్లి అక్టోబర్ చివర్లో గానీ.. నవంబర్ లో గానీ ఉండొచ్చని అనుకున్నారంతా. ఇక తాజాగా వరుణ్,లావణ్య ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ఈ సెలెబ్రేషన్స్ కి మెగా ఫ్యామిలీ, లావణ్య ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ అంతా హాజరయ్యారు. 

ఇందుకు సంబందించిన ఫోటోలు తన ట్విట్టర్ లో షేర్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన ఫ్యాన్స్ అండ్ నెటిజన్స్ వరుణ్, లావణ్యకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు.