మట్కా ఓపెనింగ్ బ్రాకెట్.. కొత్త అవతారంలో వరుణ్ తేజ్

మట్కా ఓపెనింగ్ బ్రాకెట్.. కొత్త అవతారంలో వరుణ్ తేజ్

సక్సెస్‌‌, ఫెయిల్యూర్స్‌‌తో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు కొత్త తరహా జానర్స్‌‌ టచ్ చేస్తూ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు అందుకున్నాడు వరుణ్ తేజ్. శుక్రవారం తన పుట్టినరోజు. ఈ సందర్భంగా వరుణ్‌‌ తేజ్ కొత్త సినిమా ‘మట్కా’ వీడియో గ్లింప్స్‌‌ను విడుదల చేశారు. ‘ప‌‌లాస 1978’ ఫేమ్ కరుణకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని  విజేందర్ రెడ్డి తీగల, రజని తాళ్లూరి నిర్మిస్తున్నారు. ఫస్ట్ బ్రాకెట్‌‌ పేరుతో విడుదల చేసిన ఈ వీడియో ద్వారా వరుణ్‌‌ గ్యాంగ్‌‌స్టర్‌‌‌‌ తరహా క్యారెక్టర్‌‌‌‌లో నటిస్తున్నట్టు చూపించారు.

పీరియాడికల్‌‌ బ్యాక్‌‌డ్రాప్‌‌లో సినిమాలోని ఇతర ముఖ్యపాత్రలను పరిచయం చేసిన మేకర్స్, వరుణ్‌‌ ముఖాన్ని మాత్రం పూర్తి స్థాయిలో రివీల్ చేయలేదు. ఫోన్‌‌లో ఎవరికో ప్రామిస్‌‌ చేస్తూ కనిపించాడు. తన టేబుల్‌‌పై పేక ముక్కలు, డబ్బుల కట్టలు ఉన్నాయి. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహీ హీరోయిన్స్‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో నవీన్ చంద్ర, రవి శంకర్, కన్నడ కిషోర్, అజయ్ ఘోష్‌‌, మైమ్ గోపీ, రూపా లక్ష్మీ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.