మార్చిలో ఆపరేషన్ వాలెంటైన్.. రిలీజ్ డేట్ వచ్చేసింది

మార్చిలో ఆపరేషన్ వాలెంటైన్.. రిలీజ్ డేట్ వచ్చేసింది

ఎయిర్ ఫోర్స్  బ్యాక్‌‌డ్రాప్‌‌లో వరుణ్ తేజ్(Varun Tej) హీరోగా తెరకెక్కిన యాక్షన్ అడ్వెంచర్ మూవీ ఆపరేషన్ వాలెంటైన్(Operation Valentine). శక్తి ప్రతాప్ సింగ్ హడా(Shakthi Prathap Sing Hada) దర్శకుడు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్, రినైసన్స్ పిక్చర్స్ సందీప్ ముద్దా నిర్మించారు. శనివారం ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్‌‌ను అనౌన్స్ చేశారు మేకvర్స్. మార్చి 1న  తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.  ఈ సందర్భంగా ఒక మిస్సైల్‌‌పై రిలీజ్‌‌ డేట్‌‌ను చూపిస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది.

వాస్తవానికి ఈ సినిమాని ఫిబ్రవరి 16న రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. కానీ కొన్ని  కారణాలతో వాయిదా వేస్తూ కొత్త విడుదల తేదీని అనౌన్స్ చేశారు. వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్  పోరాటాలని, దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను చూపించబోతున్నారు. రాడార్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌గా హీరోయిన్ మానుషి చిల్లర్‌‌‌‌ నటించగా, వింగ్ కమాండర్‌‌‌‌గా నవదీప్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన వరుణ్ తేజ్ లుక్స్‌‌తో పాటు టీజర్, పాటలు సినిమాపై అంచనాలు పెంచాయి.