డిసెంబర్ 8న వరుణ్ తేజ్ ఫిలిం ఆపరేషన్ వాలెంటైన్ రిలీజ్

డిసెంబర్ 8న వరుణ్ తేజ్ ఫిలిం ఆపరేషన్ వాలెంటైన్ రిలీజ్

వరుణ్ తేజ్ హీరోగా యాడ్ ఫిల్మ్ మేకర్ శక్తి ప్రతాప్ సింగ్ హడా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్‌‌‌‌గా నటిస్తున్నాడు వరుణ్ తేజ్. గురువారంతో ఈ మూవీ షూటింగ్ పూర్తయిందని తెలియజేశారు మేకర్స్. ఈ  సందర్భంగా సెట్‌‌‌‌లో టీమ్‌‌‌‌ అంతా  కలిసున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘ఇది మరచిపోలేని అధ్యాయం’ అంటూ ట్వీట్ చేశారు. 

హీరోయిన్ మానుషి చిల్లర్ రాడార్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది. సోనీ పిక్చర్స్, రినైసెన్స్ పిక్చర్స్ సంస్థలు కలిసి  నిర్మిస్తున్న  ఈ చిత్రం డిసెంబర్ 8న తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. మరోవైపు హీరోయిన్ లావణ్య త్రిపాఠితో త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న వరుణ్​ తేజ్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌‌‌‌తో ఎంజాయ్ చేస్తున్నాడు. నవంబర్ 1న వీరి పెళ్లి జరగనుందని వార్తలు వస్తున్నప్పటికీ అఫీషియల్‌‌‌‌గా ప్రకటించలేదు.