Korean Kanakaraju OTT Release: ఓటీటీలోకి 'కొరియన్ కనకరాజు'.. వరుణ్ తేజ్ హారర్ కామెడీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Korean Kanakaraju OTT Release: ఓటీటీలోకి 'కొరియన్ కనకరాజు'.. వరుణ్ తేజ్ హారర్ కామెడీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ 'కొరియన్ కనకరాజు'. భారీ అంచనాల మధ్య ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో నవ్వులు పూయించిన ఈ చిత్రం  ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనను అందుకుని పర్వాలేదు అనిపించింది. అయితే ఇప్పుడు ఈ మూవీ డిజిటల్ ప్రిమియర్ ద్వారా గ్లోబల్ ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో సెప్టెంబర్ 4, 2026 నుంచి తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

కథేంటంటే?

సాధారణంగా దెయ్యం అనగానే భయపెట్టే దెయ్యాలను చూసుంటారు, కానీ కొరియన్ దెయ్యం మన రాయలసీమ కుర్రాడికి పడితే ఎలా ఉంటుందో చూపించడమే ఈ సినిమా ప్రత్యేకత. అనంతపురం జిల్లా పెనుకొండలో ఉండే కనకరాజు (వరుణ్ తేజ్) కోపిష్టి కుర్రాడు. అదే ఊర్లో ఉండే కియా కంపెనీ ఉద్యోగిని చైత్ర (రితికా నాయక్) తో కథ ముడిపడి ఉంటుంది. అయితే ఒక కొరియన్ వ్యక్తి అస్తికలు ఉన్న కుండ విదేశాల నుంచి కొన్ని ఊహించని పరిస్థితుల్లో అనంతపురం బార్‌కి చేరుకుంటుంది. గొడవలో ఆ కుండ పగలడం, దాంట్లోని వైన్‌ను కనకరాజు తాగేయడంతో కథ ఊహించని మలుపు తిరుగుతుంది.

ఆత్మ పూనితే అల్లరే..

కనకరాజు ఒంటిలోకి ఆ కొరియన్ ఆత్మ ప్రవేశించాక, అతడు చేసే వింత చేష్టలు, కొరియన్ భాషలో మాట్లాడే తీరు థియేటర్లలో నవ్వుల పంట పండించాయి. కనకరాజు ఆ ఆత్మ వదిలించుకోవడానికి పడే పాట్లు నవ్వులు పూయిస్తాయి. థియేట్రికల్ రన్ ముగించుకున్న ఈ 'కొరియన్ కనకరాజు' ఇప్పుడు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 4, 2026 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

ALSO READ : 'ఆది' సెంటిమెంట్ రిపీట్..'ధర్మస్థల నియోజకవర్గం' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వి. వి. వినాయక్ !

'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్', 'ఎక్స్‌ప్రెస్ రాజా' చిత్రాల ఫేమ్ మేర్లపాక గాంధీ మార్క్ కామెడీ ఈ సినిమాకి ప్రధాన బలం. కనకరాజు ఫ్రెండ్‌గా కమెడియన్ సత్య తన టైమింగ్‌తో సెకండాఫ్‌ను నిలబెట్టాడు. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఎస్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు సినిమాకి మంచి హైప్ తెచ్చాయి. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం థియేటర్లలో మంచి వసూళ్లు సాధించింది. థియేటర్లలో మిస్ అయిన మూవీ లవర్స్ అండ్ హారర్ కామెడీ ఫ్యాన్స్ సెప్టెంబర్ 4 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ క్రేజీ రైడ్‌ను ఎంజాయ్ చేయవచ్చు...