
వాల్మీకీ టైటిల్ పై వివాదం రేగుతుండటంతో హైకోర్టు ఆదేశాల మేరకు టైటిల్ మార్చింది చిత్ర యూనిట్. వాల్మీకి పేరును తొలగించి గద్దలకొండ గణేశ్ అనే కొత్త టైటిల్ ను పెడుతున్నట్లు మూవీ డైరెక్టర్ తెలిపారు. వాల్మీకి టైటిల్ పై బోయ సామాజిక వర్గం అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేసింది. దీనిని విచారించిన హైకోర్టు మూవీ యూనిట్ కు నోటీసులిచ్చింది. అయితే వివాదాల మేరకు టైటిల్ ను మారుస్తున్నట్లు మూవీ ప్రొడ్యూసర్, డైరెక్టర్ కోర్టుకు తెలిపారు.