Vastu tips:ఈశాన్యం తగ్గి.. వాయువ్యం పెరిగినా.. ..దక్షిణ, పడమర దిక్కుల్లో రోడ్డు ఉంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!

Vastu tips:ఈశాన్యం తగ్గి.. వాయువ్యం పెరిగినా.. ..దక్షిణ, పడమర దిక్కుల్లో రోడ్డు ఉంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!

 ఇంట్లో ప్రతిది వాస్తు ప్రకారమే ఉండాలి.. అంతేకాదు ఇంటి నిర్మాణం విషయంలో చాలా  జాగ్రత్తలు తీసుకోవాలి..  తూర్పు మెయిన్​ డోర్​..రె ఈశాన్యం తగ్గడం..వాయువ్యం పెరిగితే నష్టాలొస్తాయా..దక్షిణ, పడమర దిక్కుల్లో రోడ్డు ఉంటే ఇల్లు ఎలా కట్టుకోవాలి.. ...మొదలగు విషయాల గురించి వాస్తు కన్సల్టెంట్​  కాశీనాథుని శ్రీనివాస్​ గారు ఏమంటున్నారో చూద్దాం...

ప్రశ్న: తూర్పు ప్రధాన ద్వారంతో ఉన్న ఇంటికి కాంపౌండ్ వాల్ ఈశాన్యంలో తగ్గి, వాయువ్యంలో పెరిగింది? ఇది కరెక్టేనా? లేకపోతే దీన్ని ఎలా సరిచేసుకోవాలి?

జవాబు : కాంపౌండ్ వాల్ ఈశాన్యంలో తక్కువగా.. వాయువ్యంలో ఎక్కువగా ఉండకూడదు. దీన్ని సరిచేసుకోవాలంటే రెక్టాంగిల్ (దీర్ఘచతురస్రాకారం)లోకి మార్చుకోవాలి. దీనికి అనుగుణంగా స్థలాన్ని వదిలి కట్టుకోవచ్చని    వాస్తు కన్సల్టెంట్​  కాశీనాథుని శ్రీనివాస్​ గారు చెబుతున్నారు.

ప్రశ్న:  దక్షిణం వైపు అరవై అడుగులు, తూర్పు వైపు ముప్పై అడుగుల స్థలం ఉంది. దక్షిణ, పడమర వైపు రోడ్లు ఉన్నాయి. ఈ స్థలంలో ఇల్లు కట్టుకోవాలంటే మెయిన్ డోర్ దక్షిణ, తూర్పు దిక్కుల్లో ఎటువైపు ఉండాలి?

జవాబు: ఉత్తరం, తూర్పు వైపు స్థలం ఎక్కువ వదలాలి. దక్షిణం, పడమర దిక్కు స్థలం తక్కువ వదిలి ఇల్లు కట్టుకోవాలి. దక్షిణ, పడమర దిక్కుల నుంచి నిర్మాణం ప్రారంభించాలి. దక్షిణ వాయువ్యం లేదా దక్షిణ సెంటర్లో మెయిన్ డోర్ ఏర్పాటు చేసుకోవాలి. లేదా పశ్చిమ వాయువ్యంలో కూడా మెయిన్​ పెట్టుకోవచ్చని  వాస్తు కన్సల్టెంట్​  కాశీనాథుని శ్రీనివాస్​ గారు సూచిస్తున్నారు.