వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్.. డేట్ ఫిక్స్

వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్.. డేట్ ఫిక్స్

మెగాస్టార్ చిరంజీవి 154వ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ రిలీజ్ కు సమయం దగ్గర పడుతోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. దీంతో వరుసగా అప్ డేట్స్ ఇస్తూ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేస్తున్నారు. సినిమాకు సంబంధించిన సాంగ్స్, పోస్టర్స్ ఇప్పటికే రిలీజ్ చేశారు. లేటెస్ట్ గా మరో అప్ డేట్ ఇచ్చింది. టైటిల్ సాంగ్ ను సోమవారం రిలీజ్ చేయనున్నట్లు మూవీ టీమ్ వెల్లడించింది. కానీ ఏ టైంలో విడుదల చేస్తారో పేర్కొనలేదు. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్‌‌‌‌ నిర్మిస్తోంది.

సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌‌‌‌ జరుగుతున్నాయి. చిరంజీవికి జంటగా శ్రుతిహాసన్‌‌‌‌ నటిస్తోంది. ఇందులో ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్ చేసింది. ఈ మాస్‌‌‌‌ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌లో రవితేజ కీలకపాత్ర పోషిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మరోవైపు బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’, విజయ్ ‘వారసుడు’ చిత్రాలు జనవరి 12న రిలీజ్ కానున్నాయి. చిరంజీవి సినిమా రిలీజ్ డేట్ కూడా ఖరారు కావడంతో.. ఈ మూడింట్లో  సంక్రాంతి విజేత ఏది అనే దానిపై ఆసక్తి నెలకొంది.