NBK 109 Movie: బాలకృష్ణ-బాబీ టైటిల్ విన్నారా..ఊరమాస్ లెవల్లో ఉందిగా!

NBK 109 Movie: బాలకృష్ణ-బాబీ టైటిల్ విన్నారా..ఊరమాస్ లెవల్లో ఉందిగా!

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నెక్స్ట్ ఫిల్మ్ (NBK109) ని బాబీ డైరెక్షన్లో చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు కూడా చాలా విభిన్నమైన యాక్షన్..ఎమోషన్తో పాటు సోషల్ మెసేజ్ను టచ్ చేస్తూ వస్తుంది. ఈ మూవీని నిర్మాత నాగ వంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఫార్చూన్ త్రివిక్రమ్ ఫోర్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

మాస్ అనే పదానికి పర్ఫెక్ట్ ఎగ్జామ్పుల్ అంటే బాలకృష్ణ అని చెప్పొచ్చు. ఆయన సినిమాల్లో మాస్ డైలాగ్స్, యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవల్లో ఉంటాయి. అందుకు తగ్గట్టుగానే బాలయ్య ఊచకోత మరోసారి చూపించేలా గ్లింప్స్ రిలీజ్ చేసి హింట్ ఇచ్చేశారు. 

లేటెస్ట్ అప్డేట్ మేరకు ఈ సినిమా టైటిల్ కి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఈ సినిమా కోసం NBK 109 ప్రొడక్షన్ హౌస్ సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ 'వీరమాస్' అనే ఒక టైటిల్ రిజిస్టర్ చేసినట్లు సమాచారం. అయితే అది ఈ సినిమా కోసమేనా లేక సితార సంస్థ నుంచి వస్తున్న వేరే సినిమా కోసమైనానా! అనే విషయం మీద మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. 

రీసెంట్ గా రిలీజ్ చేసిన గ్లింప్స్ ఊరమస్ గా ఉంది.'సింహం నక్కల మీదకు వస్తే.. వార్ అవ్వదురా లఫూట్ ..హంటింగ్ అంటూ బాలయ్య సిగ్నేచర్ డైలాగ్ తో ఒక్కసారిగా ఫ్యాన్స్ కు ఫుల్ ఎక్కించేశాడు.మరి సినిమాతో ఎలాంటి కిక్ ఎక్కిస్తాడో చూడాలి. 

ఈ మూవీలో ‘యానిమల్‌‌‌‌’తో మెప్పించిన బాబీడియోల్ విలన్‌‌‌‌గా నటిస్తున్నాడు. ఇందులో మరో ముఖ్యమైన పాత్ర కోసం ఒక యంగ్ హీరో కూడా నటిస్తున్నాడు.మన తెలుగు వాళ్లకి సీతారాముడిగా..ఎంతో సుపరిచుతులైన మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (DulquarSalman) నటిస్తున్నట్లు సమాచారం.