రానా నాయుడు సరికొత్త రికార్డ్.. ఇండియా నుండి ఒకే ఒక్కటి

రానా నాయుడు సరికొత్త రికార్డ్.. ఇండియా నుండి ఒకే ఒక్కటి

టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) నటించిన మొదటి వెబ్ సిరీస్ రానా నాయుడు(Rana Naidu). తండ్రీ కొడుకుల కాన్సెప్ట్ తో వచ్చిన ఈ బోల్డ్ వెబ్ సిరీస్ ఆడియన్స్ ను బాగానే ఆకట్టుకుంది. కాకపోతే.. వెంకటేష్ పై మాత్రం తీవ్ర విమర్శలు వచ్చాయి. కారణం ఈ సిరీస్ లో వెంకటేష్ బోల్డ్ సీన్స్ అండ్ డైలాగ్స్ చెప్పడం. నిజానికి వెంకటేష్ కు ఫ్యామిలీ ఆడియన్స్ లో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. కాబట్టి.. అందుకు బిన్నంగా అలా బోల్డ్ సిరీస్ లో కనిపించడం ఆయన ఫ్యాన్స్ తీసుకోలేకపోయారు.

అయితే మన ప్రేక్షకులకు పెద్దగా ఎక్కకపోయినా.. వరల్డ్ వైడ్ ఆడియన్స్ ను మాత్రం సూపర్ గా ఆకట్టుకుంది. ఈ క్రమంలో సరికొత్త అండ్ ఎవరు బీట్ చేయలేని రికార్డ్ క్రియేట్ చేసింది రానా నాయుడు వెబ్ సిరీస్. అదేంటంటే.. నెట్ ఫ్లిక్స్ సంస్థ గత ఆరు నెలాలుగా ఎక్కువ వ్యూస్‌ సాధించిన సుమారు 18వేల టైటిల్స్‌ డేటాను పరిశీలించింది.

అందులో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ వ్యూస్‌ సాధించిన టాప్‌ 400లో రానా నాయుడు వెబ్ సిరీస్ 336వ చోటును దక్కించుకుంది. అంతేకాదు..  ఈ లిస్టులో ఇండియా నుండి చోటు దక్కించుకున్న ఏకైక వెబ్ సిరీస్ గా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది రానా నాయుడు సిరీస్. ఈ సిరీస్ కు 46 మిలియన్ల గంటలు వైవర్షిప్ వచ్చినట్లు నెట్ ఫ్లిక్స్ సంస్థ తెలిపింది. యాక్షన్‌ అండ్ క్రైమ్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్‌లో.. వెంకటేష్, రానా తండ్రీ కొడుకులుగా నటించారు. ఇక త్వరలోనే ఈ సిరీస్ కు సీక్వెల్ కూడా రానుంది. దానిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా చేయనున్నారు మేకర్స్.