అదిరిపోయే కామెడీతో ఎఫ్-3 ట్రైలర్ వచ్చేసింది..!

అదిరిపోయే కామెడీతో ఎఫ్-3 ట్రైలర్ వచ్చేసింది..!

విక్టరీ వెంకటేష్ , వరుణ్ తేజ్ కలిసి నటించిన ఎఫ్-3 సినిమా మే-27న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. వెంకీ సరసన మిల్కీబ్యూటీ తమన్నా , వరుణ్ తో మెహ్రీన్‌ హీరోయన్లుగా నటించిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వ‌రా క్రియేష‌న్స్ ప‌తాకంపై దిల్‌రాజు, శిరీష్‌లు నిర్మించారు. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ప్రమోషన్స్ స్పీడప్ చేసింది యూనిట్. ఇప్పటికే  ఈ సినిమా పోస్టర్స్‌, పాటలను రిలీజ్ చేయగా..  ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతున్న క్రమంలో మేకర్స్‌  ఎఫ్‌-3 ట్రైలర్‌ను విడుదల చేశారు. 'ప్రపంచానికి తెలిసిన పంచభూతాలు ఐదే.. కానీ ఆరవ భూతం ఒకటుంది అదే డబ్బు' అంటూ ట్రైలర్‌ ప్రారంభమవుతుంది. 'డబ్బు ఉన్నవాడికి ఫన్‌.. లేని వాడికి ఫ్రస్టేషన్‌, సీక్వెల్‌లో కూడా వీడికి సేమ్‌ డైలాగ్స్‌.. అంతేగా, అంతేగా'..వంటి డైలాగులు ఆకట్టకుంటున్నాయి. పాతిక ల‌క్ష‌లు..దీన్ త‌ల్లి తెల్లారే సరికి యైభై అయిపోవాలి అంటూ వ‌చ్చిన సంభాష‌ణ‌లు ఆక‌ట్టుకుంటున్నాయి.

ఇయ్ ఇలాంటి ఔలా గాల్లంద‌రికి పైస‌లియ్.. అరే సొంత కొడ‌క్కు పైస‌ల్ ఇయ్య‌డానికి మ‌న‌స్సు రాదు అంటూ దేవుడితో వ‌రుణ్‌తేజ్ మొర పెట్టుకోవ‌డం హాస్యాస్పదంగా ఉంది. అదో పెద్ద మాయ‌ల మ‌రాఠి ఫ్యామిలీ.. వాళ్ళది మ‌రాఠి ఫ్యామిలీ అయితే మాది ద‌గ్గుబాటి ఫ్యామిలీ ఐ వోంట్ లీవ్ అమ్మా.. నా మాట విను వాళ్ళ‌ది పెద్ద ద‌గా ఫ్యామిలీ.. వాళ్ళ‌ది ద‌గా ఫ్యామిలీ అయితే మాది మెగా ఫ్యామిలీ. అంటూ వ‌చ్చిన డైలాగ్స్ సూప‌ర్ ఎంట‌ర్టైనింగ్‌గా ఉన్నాయి.  ఈ సీక్వెల్‌లో డ‌బ్బు, బంగారం అని ఆశ‌ప‌డే వారి భార్య‌ల వ‌ల్ల హీరోలు ఎలాంటి ఇబ్బందులు ప‌డ్డారో తెలియ‌జేసేలా F3 సినిమా ఉంటుంద‌ని అర్థ‌మ‌వుతుంది. ఇందులో ఆస‌క్తిక‌ర విష‌యం ఏంటంటే వెంక‌టేష్‌కు రేచిక‌టీ, వ‌రుణ్ తేజ్‌కు న‌త్తి ఉండ‌నున్నట్లు తెలుస్తుంది విజువల్స్, ఆన్ స్క్రీన్ పై హీరోయిన్లను అందంగా చూపించారు.  సునీల్, సోనాల్‌చౌహ‌న్‌లు కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించారు. దేవీ శ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ అందించిన ఈ మూవీలో పూజా హెగ్టే ఓ స్పెష‌ల్ సాంగ్‌లో న‌ర్తించింది. F3 గ‌తంలోనే విడుద‌ల కావాల్సంది. కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డుతూ వ‌చ్చింది.