Venkatesh Speech: వెంకీమామ కాదు..సైకో..లేదా..సైంధవ్ అంటారు

Venkatesh Speech: వెంకీమామ కాదు..సైకో..లేదా..సైంధవ్ అంటారు

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ (Venkatesh)..ఈ సంక్రాంతికి సైంధవ్ (Saindhav) మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు.హిట్‌ చిత్రాల దర్శకుడు శైలేశ్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నుంచి..లేటెస్ట్గా ట్రైలర్ రిలీజ్ చేయడంతో విశేష స్పందన వస్తోంది.  

ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో భాగంగా వెంకటేష్ తన స్పీచ్తో అదరగొట్టారు. ఈ సినిమా తర్వాత తనని వెంకీ మామ కాదు సైకో అని సైంధవ్ అని పిలుస్తారని అన్నారు. ఈరోజు చాలా హ్యాపీగా ఉందని..అన్ని వర్గాల ఆడియన్స్కు సినిమా తప్పకుండా నచ్చుతుందని అన్నారు. ఇన్నేళ్లుగా తన మీద చూపిస్తున్న ప్రేమ అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. 

ఇటువంటి రియలిస్ట్ సబ్జెక్టుతో 75వ ప్రాజెక్ట్ చేయడం లక్కీ అని..ఎప్పటి నుంచో న్యూ ఏజ్ యాక్షన్ ఫిల్మ్ చేయాలని ఉండేదని..అది సైంధవ్తో కుదిరిందని అన్నారు వెంకటేష్. అంతేకాకుండా..ఈ సినిమా మొదలైన 15 నిమిషాల్లో ఇన్వాల్వ్ అవుతారు.

సినిమా బాగుంటే ఎక్కువ మాట్లాడతా..బాగలేదంటే ఇంతకంటే తక్కువ మాట్లాడతా..ఈ సినిమా మిమ్మల్ని డిజప్పాయింట్ చేయదు. తప్పకుండా సైంధవ్ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుందని అన్నారు వెంకటేష్. అలాగే మీడియా వారందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మీడియా వాళ్లంతా బాగుండాలి మా సినిమా గురించి బాగా రాయాలని అన్నారు.

హై-యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంతో బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెర్మియా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీని నిహారిక ఎంటర్టైనమెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నారు.సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా జనవరి 13న రిలీజ్ కాబోతుంది.