Saindhav Trailer Review: నాకేం కాదు నాన్న..నువ్వున్నావ్ కదా

Saindhav Trailer Review: నాకేం కాదు నాన్న..నువ్వున్నావ్ కదా

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ (Venkatesh)..ఈ సంక్రాంతికి సైంధవ్ (Saindhav) మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు.హిట్‌ చిత్రాల దర్శకుడు శైలేశ్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా వరుస ప్రమోషన్స్ చేస్తూ ఆడియెన్స్లో భారీ హైప్ క్రియేట్ చేస్తున్నారు.

లేటెస్ట్గా సైంధవ్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. కూతురి ప్రేమతో మొదలైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. నరాల సమస్యతో బాధపడే కూతుర్ని ఎలా బతికించుకోవాలో..తండ్రి పడే ఆవేదని చూపించారు. నాకేం కాదు నాన్న..నువ్వున్నావ్ కదా..నువ్వు నా సూపర్ హీరో అంటూ తండ్రి కూతురి మధ్య ఉన్న ఎమోషన్ తో ట్రైలర్ గుండెల్ని తాకుతుంది. వెంకీ..సైంధవ్గా ఎమోషన్స్తో పాటు ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో..సైకో అనే క్యారెక్టర్ రోల్లో కనిపిస్తోన్నట్లు తెలుస్తోంది. తొక్కు దీనమ్మా ..నా తల తీసుకొస్తే..మీకు డబ్బులిస్తామన్నారా? నా తల తీసుకెళ్లాలంటే..మీకు తలలు ఉండాలి కదరా అనే వెంకీ డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. 

ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్,టీజర్,సాంగ్స్ ను బట్టి..సైంధవ్ పక్క ఎమోషన్ యాక్షన్ ఫిల్మ్ అనే విషయం అర్థమవుతోంది.దీంతో వెంకీ 75 వ మూవీ ఒక మైల్ స్టోన్గా మారడం కన్ఫమ్ అని తెలుస్తోంది. 

ట్రైలర్ రివ్యూ:

చంద్రప్రస్థ ఫిక్షనల్ పోర్ట్ ఏరియా బ్యాక్ డ్రాప్ లో సాగే సీక్రెట్ మిషన్ నేపథ్యంలో సైంధవ్ తెరకెక్కుతోంది.అలాగే ఈ మూవీలో వెంకటేశ్ కూతురు అరుదైన వ్యాధితో బాధపడుతుందని తెలుస్తోంది. దీంతో ప్రతి తండ్రిలాగే వెంకీ కూడా తన కూతురు కోసం అనేక కష్టాలు ఎదుర్కొంటారు. ఏలాగైనా కూతుర్ని రక్షించుకునే క్రమంలో..తన కూతురు వైద్యం కోసం రూ.17 కోట్లు విలువ చేసే ఇంజక్షన్ అవసరం ఉంటుంది.ఇక అదే ఇంజక్షన్ విలన్ కు కూడా కావాల్సి ఉండటంతో..ఇద్దరి మధ్య జరిగే పోరాటమే సైంధవ్ అని తెలుస్తోంది. 

హై-యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంతో బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెర్మియా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీని నిహారిక ఎంటర్టైనమెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నారు.సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా జనవరి 13న రిలీజ్ కాబోతుంది.