Saindhav Movie: తండ్రి గుండె బాధను తెలిపే బుజ్జికొండవే సాంగ్

Saindhav Movie: తండ్రి గుండె బాధను తెలిపే బుజ్జికొండవే సాంగ్

హీరో విక్టరీ వెంకటేష్ (Venkatesh) ప్రస్తుతం తన కెరీర్ మైల్ స్టోన్ మూవీ 75వ ప్రాజెక్ట్లో నటిస్తున్నారు. సైంధవ్ (Saindhav) అనే విభిన్న టైటిల్తో వస్తూ  ఆడియన్స్ను అట్ట్రాక్ట్ చేశాడు వెంకీ. ఈ మూవీని హిట్ చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను(Sailesh Kolanu) తెరకెక్కిస్తున్నాడు. 

లేటెస్ట్గా ఈ మూవీ నుంచి బుజ్జికొండవే (BujjiKondave) మూడో లిరికల్‌ సాంగ్ను రిలీజ్ చేశారు మేకర్స్. తండ్రీకూతుళ్ల అనుబంధం..బిడ్డకు ఆపద వస్తే..తండ్రి పడే వేదనను ఈ పాటలో చక్కగా చూపించారు. వెంకటేష్కి..తన కూతురికి మధ్య వచ్చే సీన్స్ కంటతడి పెట్టిస్తున్నాయి. కూతురి శ్వాస సమస్యతో సాగే ఈ పాట..తండ్రి గుండె బాధను తెలియజేస్తుంది. 

బంగారమే బంగారమే..న్వువు నా వరమే..నీ క్షేమమే..నీ సంతోషమే..నన్ను నడిపించే బలమే అంటూ సాగే సాంగ్ గుండెలకు హత్తుకునేలా ఉంది. చిట్టి తల్లి నీవే..పుట్టుకంటే నీదే..దేవతల్లే నన్నే చేరుకుంటివే..గుండె పట్టనంత ప్రాణం అంటే నీవే..నాన్నలాగా నన్నే ఎంచుకుంటివే..అంటూ వచ్చే లిరిక్స్ ప్రతి తల్లి తండ్రుల గుండెలను తాకేలా రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ఈ పాటను సంతోష్ నారాయణన్ స్వర పరచగా..S.P.చరణ్ తన ప్రాణం పెట్టి పాడారు.

వెంకటేష్కి జోడీగా శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తున్న ఈ సినిమాలో రుహాని శర్మ, ఆండ్రియా జెర్మియా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో జనవరి 13న రిలీజ్ సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతుంది. 

  • Beta
Beta feature