Sailesh Kolanu: సైంధవ్ విశేషాలతో శైలేష్ కొలను..ఆ క్షణం వెంకీకి వీరాభిమానిగా మారిపోయా

Sailesh Kolanu: సైంధవ్ విశేషాలతో శైలేష్ కొలను..ఆ క్షణం వెంకీకి వీరాభిమానిగా మారిపోయా

హీరో వెంకటేష్ (Venkatesh) కెరీర్ మైల్ స్టోన్ 75వ మూవీ సైంధవ్ (Saindhav). ఈ సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న సినిమాలను చూసుకుంటే..యాక్షన్  స్పార్క్..తండ్రి కూతుళ్ల ఎమోషన్స్ బలంగా ఉన్న చిత్రంగా..జనవరి 13న థియేటర్లోకి రాబోతుంది.

వెంకీ ఈ సినిమాలో తనదైన నటనతో అన్ని వర్గాల ఆడియాన్స్ను ఆకట్టుకోబోతున్నాడు.ఈ సినిమా ప్రతి ఒక్కర్ని..ముఖ్యంగా ప్రతి తల్లి తండ్రుల్ని ఎమోషన్స్తో కట్టి పడేస్తుందని మేకర్స్ వరుస ప్రమోషన్ల వేదికలపై చెబుతూ వస్తున్నారు. లేటెస్ట్గా డైరెక్టర్ శైలేష్ కొలను( Sailesh Kolanu) ఇంటర్వ్యూలో పాల్గొని ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. 

జర్నలిస్టు: సైంధవ్ ప్రాజెక్ట్ ఎలా స్టార్ అయ్యింది ?

శైలేష్ కొలను: అడవి శేష్ తో తీసిన ‘హిట్ 2’ మూవీ రిలీజ్ తర్వాత ప్రొడ్యూసర్ వెంకట్ బోయినపల్లి వెంకటేష్ ని కలవమని చెప్పగా కలిశా.అక్కడ వెంకీతో మొదలైన ప్రయాణం..ఇవాళ తన మైల్ స్టోన్ ఫిలిం తెరకెక్కించే వరకు కొనసాగుతోంది. మొదట మేము కలిసినప్పుడు అసలు సినిమాల ప్రస్తావన లేకుండా మాట్లాడుకున్నాం. ఇక మా జర్నీముందుకు పోయే కొద్దీ సినిమా చేస్తే బాగుంటుందని అనిపించింది. అప్పుడు నా దగ్గర వున్న కథల్లో ముందుగా సైంధవ్ ఐడియా చెప్పాను. ఆయనకు ఈ స్టోరీ బాగా నచ్చింది. స్టోరీ విన్నాక ఆయన ‘ఇది నా 75వ సినిమా అనిపిస్తోంది’ అని చెప్పారు. ఇక ఆ తర్వాత ఐడియాని మరింత డెవలప్ చేసి పూర్తి స్థాయి స్క్రిప్ట్ గా వెంకీకి చెప్పగానే..కథ మొత్తం విని ఓ హాగ్ ఇచ్చి..ఇది సినిమాగా చేస్తున్నాం అన్నారు. 

జర్నలిస్టు: ఇది వెంకటేష్ 75వ చిత్రం అనే ఒత్తిడి ఏమైనా కలిగిందా?

శైలేష్ కొలను: సినిమా స్టార్ట్ చేసినపుడు లేదు. షూటింగ్ చేసేటప్పుడు లేదు. సినిమా రిలీజ్ అవుతుంటే..అంటే గత వారం రోజులుగా ఏదో టెన్సన్  ఉంది. రీసెంట్ గా జరిగిన ఈవెంట్స్ లో వెంకటేష్ ఏవీలు చూస్తున్నపుడు..ఇంత అద్భుతమైన జర్నీ,ఇంత గొప్ప సినీ కెరీర్ ఉన్న హీరోతో సినిమా చేశామా? అనే టెన్షన్ నాలో కలుగుతోంది. ఈ సినిమాలో ఉన్న ఎమోషన్స్ తో వెంకీ ఫ్యాన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చేలా చిత్రాన్ని తెరకెక్కించిన స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది. 

జర్నలిస్టు: సైంధవ్ స్క్రిప్ట్ విషయంలో వెంకటేష్ ఎలాంటి ఇన్ పుట్స్ ఏమైనా ఇచ్చారా?

శైలేష్ కొలను: నా గత సినిమాలు చూసుకుంటే..నేను అన్నీ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ చేశాను.కానీ,సైంధవ్ లాంటి ఎమోషనల్ డెప్త్ ఉన్న కథతో..  సినిమా చేయడం ఇదే ఫస్ట్ టైం. సినిమా షూటింగ్స్ చేసేటపుడు వెంకటేష్ ఎమోషనల్ సీన్స్ లో నటించేటప్పుడు..ఆయన ఇచ్చిన సలహాలు చాలా సినిమా మేకింగ్ కు..కన్నీళ్లను రాబట్టడానికి ఎంతో ఉపయోగపడ్డాయి. 

జర్నలిస్టు:  సైంధవ్ షూటింగ్ ఎక్కువగా నైట్ సీక్వెన్స్ లో తెరకెక్కించినట్లు తెలుస్తోంది?

శైలేష్ కొలను:  అవునండీ. సైంధవ్ కథ దాదాపు డెబ్బై శాతం నైట్ టైంలోనే జరుగుతుంది. స్క్రిప్ట్ చెప్పేటప్పుడే..వెంకటేష్ కి ఈ విషయం చెప్పాను. మొదట.. వెంకటేష్ , పాప, శ్రద్దా శ్రీనాథ్ పాత్రలు ఆసక్తికరంగా పరిచయమవుతూ కథ చాలా హాయిగా మొదలౌతుంది. పదిహేను నిమిషాల తర్వాత ఆడియాన్స్ తల తిప్పుకోలేరు. అంత ఉత్కంఠభరితంగా,ఆసక్తిగా స్పీన్స్ సాగుతాయి.  

జర్నలిస్టు: సైంధవ్ జర్నీలో వెంకటేష్ కి వీరాభిమానిగా మారిపోయినట్లు ఉన్నారు?

శైలేష్ కొలను: రీసెంట్గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పాను. చిన్నప్పుడు కమల్ హాసన్ సినిమాలు చూశాను. దీంతో ఆయన వర్క్,ఆయన మార్క్ నాపై ఒక బలమైన ముద్ర వేసింది. కమల్ హాసన్ నటించిన హే రామ్ సినిమా చూసి తర్వాత సినిమాల్లోకి రావాలని డిసైడ్ అయ్యాను. ఇక వెంకటేష్ తో వర్క్ చేయడం మొదలు పెట్టిన క్షణం నుండి..ఆయన క్లోజప్పులు, నటన చూస్తుంటే, అద్భుతం..ఇలాంటి ఫీలింగ్ కొరకే ఇండస్ట్రీకి వచ్చానని అనిపించింది. నేను చిన్నప్పటి నుంచి వెంకటేష్ సినిమాలు కనుక చూసుంటే ఆయన ప్రభావం కూడా నాపై ఉండేదని అనిపించింది. అందుకే వెంకటేష్ కి  వీరాభిమానిగా మారాను. 

జర్నలిస్టు: సైంధవ్ లో చూపించిన ఇంద్రప్రస్థ’ సిటీ గురించి కొన్ని విషయాలు చెప్పండి ?

శైలేష్ కొలను: సినిమా ట్రైలర్ లో చూపించిన డ్రగ్ కార్టేల్స్, గన్ బిజినెస్..ఇలా పెద్ద స్కేల్ లో సైంధవ్ కథ జరుగుతుంటుంది. ఈ కథ మొత్తం సముద్రతీరంలో..తీర ప్రాంతాల చుట్టే జరగాలి. ఇక వైజాగ్ లో ఇంత పెద్ద కార్యకలాపాలు జరుగుతాయంటే నమ్మశక్యంగా అనిపించదు. ఇక అలా అని ముంబైలో పెట్టుకుంటే నేటివిటీ పోతుంది. అందుకే మేమే ‘ఇంద్రప్రస్థ’ అనే ఫిక్షనల్ టౌన్ ని క్రియేట్ చేసి సినిమా తెరకెక్కించాం.

జర్నలిస్టు: సైంధవ్ ప్రచార వీడియోలు చూస్తే చాలా కాస్ట్లీ సినిమా అనిపిస్తోంది?

శైలేష్ కొలను: సైంధవ్ నిర్మాత వెంకట్ సినిమా స్క్రిప్ట్ దగ్గర నుంచి చాలా క్లియర్ గా వున్నారు. ఆయనకు వెంకటేష్ అంటే ఇష్టం. అందువల్ల ఆయనకు గొప్ప సినిమా ఇవ్వాలి’’ అని వెంకట్ బోయినపల్లి నాకు ముందే చెప్పారు. అందుకు కావాల్సిన ప్రతిది నాకు సమకూర్చారు. సినిమా తెరకెక్కించడంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా సైంధవ్ ను నిర్మించారు.

జర్నలిస్టు: మళ్ళీ సైంధవ్ 2 వుంటుందా ?

శైలేష్ కొలను: గతంలో వచ్చిన హిట్ 1 మూవీని ఆడియన్స్ ఇష్టపడ్డారు కాబట్టి హిట్ 2 తీశాం. సైంధవ్ ని ప్రేక్షకులకు ఇష్టపడితే తప్పకుండా పార్ట్ 2 చేస్తామనే నమ్మకం వుంది.

జర్నలిస్టు: మీ నుంచి ఒక ప్రేమకథ ఆశించవచ్చా ?

శైలేష్ కొలను: నాకూ ఎప్పట్నుంచో చేయాలనే వుంది. నా దగ్గర ఒక మంచి ప్రేమ కథ వుంది. నా లైఫ్ లో జరిగిన సంఘటనలను తీసుకుని ఒక ప్రేమకథని రాశాను. తప్పకుండా దాన్ని కథని చేస్తాను.