సైంధవ్‌ మూవీ బిగ్ అప్డేట్.. టీజర్ డేట్ వచ్చేసింది

సైంధవ్‌ మూవీ బిగ్ అప్డేట్.. టీజర్ డేట్ వచ్చేసింది

హిట్(Hit), హిట్2(Hit2) చిత్రాల దర్శకుడు శైలేష్‌ కొలను(Shailesh kolanu) దర్శకత్వంలో విక్ట‌రీ వెంకటేశ్(Victory Venkatesh) చేస్తున్న మూవీ సైంధవ్‌(Saindhav). వెంకటేష్ కెరీర్ లో 75వ సినిమాగా రానున్న ఈ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్(Shradda srinath), ఆండ్రియా(Andria) హీరోయిన్స్ గా నటిస్తున్నారు. యాక్షన్ అండ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో రానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న గ్రాండ్ గా రిలీజ్ కానుంది ఈ సినిమా. 

ఇక తాజాగా సైంధవ్‌ మూవీ టీజర్ రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్.  అక్టోబర్ 16న ఈ టీజర్ రిలీజ్ కానుందని చెప్తూ కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. దీంతో వెంకటేష్ ఫ్యాన్స్ హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు. చాలా కాలం తరువాత వెంకటేష్ ఈ సినిమాలో పూర్తి యాక్షన్ కనిపిస్తున్నారు. దీంతో ఆడియన్స్ ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 

ఇక సైంధవ్‌ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ, తమిళ నటుడు ఆర్య, రుహానీ శర్మ తదితరులు ప్రముఖ పాత్రల్లో కనిపిస్తున్నారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వస్తున్న ఈ పాన్ ఇండియా మూవీకి.. సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నారు. మరి ఈ సినిమా వెంకటేష్ కు ఎలాంటి రిజల్ట్ ను అందించనుందో చూడాలి. 

ALSO READ : CWC 2023: పగబట్టిన దోమలు.. డెంగ్యూ బారిన పడ్డ మరో భారత దిగ్గజం