సంక్రాంతికి ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తారు : వెంకటేష్

సంక్రాంతికి ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తారు  : వెంకటేష్

‘పైసలనే నువ్వు వాడుకోవాలే బాబాయ్.. మనుషులనే లవ్ సెయ్యాలే.. మనుషులనే వాడి, నోట్ల కట్టలనే లవ్ చేసి.. కట్టల్లో పడి లైఫ్‌‌‌‌తో కట్ అయ్యావే.. చేయకు చేయకు డబ్బును చేయకు రాంగ్ యూసెజ్.. చేయకు చేయకు లైఫ్‌‌‌‌ను చేయకు రాంగ్ యూసెజ్’ అంటున్నారు వెంకటేష్. ఆయన హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న చిత్రం ‘సైంధవ్‌‌‌‌’. 

ఇందులోని ‘రాంగ్ యూసెజ్‌‌‌‌’ అంటూ సాగే పాటను మంగళవారం విడుదల చేశారు. సంతోష్ నారాయణన్ కంపోజ్ చేసిన ఈ పాటకు చంద్రబోస్‌‌‌‌ అర్థవంతమైన లిరిక్స్ రాయగా.. నకాష్ అజిజ్‌‌‌‌ ఎనర్జిటిక్‌‌‌‌గా పాడాడు. సాంగ్ లాంచ్ ఈవెంట్‌‌‌‌లో వెంకటేష్ మాట్లాడుతూ ‘ఇది నా 75వ చిత్రం. నా మనసుకు దగ్గరైన చిత్రం. ఇదొక ఎమోషనల్ న్యూ ఏజ్ యాక్షన్ థ్రిల్లర్. చాలా ఎక్స్ ట్రార్డినరీగా వచ్చింది. 

తప్పకుండా అందరికీ నచ్చుతుంది. ఇక ఈ పాటలో డబ్బు, మనుషులు, స్నేహం గురించి మీనింగ్ ఫుల్ లిరిక్స్  రాశారు చంద్రబోస్. చాలా అద్భుతమైన చిత్రం చేశాం. సంక్రాంతికి ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తారు’ అని చెప్పారు. దర్శకుడు శైలేష్ మాట్లాడుతూ ‘ఇప్పటివరకూ నేను తీసిన చిత్రాలలో బెస్ట్ వర్క్ ‘సైంధవ్’. సినిమా చాలా బాగుంటుందని నమ్మకంగా చెబుతున్నా. ఈ పాటలో చక్కని మెసేజ్ చెప్పాం. లిరిక్స్ వింటే చాలా ఎంజాయ్ చేస్తారు’ అని అన్నాడు. నిర్మాత వెంకట్ బోయనపల్లి, సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్, డీవోపీ మణికందన్ పాల్గొన్నారు.