విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47'. వెంకీ మామ, డైలాగ్ కింగ్ త్రివిక్రమ్ తొలిసారి చేతులు కలపడంతో ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ చిత్రం నుంచి లేటెస్ట్ గా ఆసక్తికర అప్‌డేట్ బయటకు వచ్చింది.
పోలీస్ ఆఫీసర్‌గా నారా రోహిత్..
ఈ అపూర్వ కలయికకు మరింత మాస్ పవర్ జోడిస్తూ.. నారా రోహిత్ ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్ తెలంగాణ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. జూలై 25న ఆయన పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ శుభాకాంక్షలు తెలుపుతూ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. బ్యాక్‌గ్రౌండ్‌లో తెలంగాణ పోలీస్ బోర్డు, డైనమిక్ లుక్‌లో ఉన్న రోహిత్‌ను చూస్తుంటే.. కథను మలుపు తిప్పే ఒక నెక్స్ట్ లెవెల్ క్యారెక్టర్‌తో ఆయన రాబోతున్నారని స్పష్టమవుతోంది..
Here's wishing the dynamic #NaraRohith garu a very Happy Birthday! 💥
— Haarika & Hassine Creations (@haarikahassine) July 25, 2026
– Team #AadarshaKutumbam
We're excited to have you on board for #AK47 and looking forward to an exciting journey! 😎#HBDNaraRohith 🔥#AK47OnOCT2nd | #Venky77 | #VenkateshXTrivikram
Victory @VenkyMama… pic.twitter.com/sinX9S5KXi
చిట్టిబాబుగా వెంకి మామ..
ఇక ప్రమోషనల్ క్యాంపెయిన్‌ను కూడా మేకర్స్ వినూత్నంగా ప్లాన్ చేశారు. సోమవారం నుంచి సినిమాలోని ప్రధాన పాత్రలను ఒక్కొక్కటిగా పరిచయం చేయనున్నారు. మొదటగా వెంకటేష్ పోషిస్తున్న 'చిట్టిబాబు'పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. వెంకటేష్‌కు జోడీగా శ్రీనిధి శెట్టి నటిస్తుండగా.. యువినా పార్థవి, రాజా ప్రజ్వల్ వెంకి మామ కుటుంబ సభ్యులుగా కనిపించనున్నారు. అలాగే రావు రమేష్, బ్రహ్మాజీ, పూజిత పొన్నాడ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
The time has come to step into the world of #AadarshaKutumbam 🔥
— Haarika & Hassine Creations (@haarikahassine) July 25, 2026
Starting this Monday, 27th July we will introduce you to our world one character at a time ❤️
Starting with our dearest @VenkyMama garu as Chitti Babu.
Followed by@SrinidhiShetty7 as Swarna. #YuvinaParthavi… pic.twitter.com/zm31vmhAdm
భారీ అంచనాలతో రెడీ..
హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్. థమన్ సంగీత అందిస్తుండగా, ఇప్పటికే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కుటుంబ భావోద్వేగాలు, వినోదం, యాక్షన్‌ను త్రివిక్రమ్ తనదైన శైలిలో మేళవించనున్నారని సమాచారం. మరి వెంకటేష్- త్రివిక్రమ్ మ్యాజిక్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
