వరుస హీట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. మెగాస్టార్ చిరంజీవి ' మన శంకర వర ప్రసాద్ గారి' మూవీ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ లతో చేతులుకలిపారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ '#VenkyAnil5' చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ మూవీపై అంచనాలు తారా స్థాయికి చేరాయి.
లేటెస్ట్ గా ఈ మూవీకి సంబంధించిన కీలక అప్డేట్ ను మేకర్ అందించారు. వెంకటేష్ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా '#VenkyAnil5' లో ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ మూవీలో వెంకీ లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డి అనే పవర్ ఫుల్ ఆర్మీ ఆపీసర్ పాత్రలో కనిపించనున్నారు.
స్వాతంత్ర దినోత్సవానికి ముందు ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇందులో వెంకటేష్ పూర్తి ఆర్మ్ కమేఫ్లాజ్ యూనిఫామ్, బ్లాక్ కంబాట్ బూట్స్ , సన్ గ్లాసెస్ ధరించి ఇంటెన్స్ గా కనిపిస్తున్నారు. ఇండియన్ ఆర్మీకి చెందిన కౌంటర్ టెర్రరిజం, హోస్టెజ్ నెగోషియేషన్ విభాగంలో స్పెషలైజేషన్ కలిగిన ఆర్మీ ఆఫీసర్ గా ఈ పాత్ర అత్యంత కీలకంగా ఉండనుంది తెలుస్తోంది.
ఈ చిత్రంలో టాలీవుడ్ ముద్దుగుమ్మలు కీర్తి సురేష్, కృతిశెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ , జెడ్ స్టూడియోస్ పతాకాలపై సాహు గారపాటి ఈ చిత్రానికి అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సంగీతం జి.వి ప్రకాష్ కుమార్ అందిస్తున్నారు. దేశభక్తి, హైవోల్టేజ్ యాక్షన్ తో తెరకెక్కిస్తున్న ఈ మూవీ 2027 సంక్రాంతికి ప్రేక్షకులకు రానుంది.
40 Glorious Years of our Victory @VenkyMama garu in TFI 😍😍😍
— Anil Ravipudi (@AnilRavipudi) August 14, 2026
It’s an absolute honour to celebrate this incredible milestone with a very special look from our film 🤗
Meet our Lt colonel VENKAT REDDY🔥#VenkyAnil5 #NKRAR2 #40YearsOfVictoryVenkatesh pic.twitter.com/WcvkXFEuox
