వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47 - AK47’. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ‘నారాయణమ్మ’ ఫోక్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకోగా, తాజాగా రెండో పాటకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ‘మాల’ అంటూ సాగే ఈ రెండో పాటను అక్టోబర్ 19న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో వెంకటేష్ ట్రెండీ లుక్లో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు.
ఆయన స్టైలిష్ లుక్తో ఉన్న ఈ పోస్టర్ పాటపై మరింత ఆసక్తిని పెంచుతోంది. మొదటి పాటతో మ్యూజిక్ పరంగా మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా, రెండో పాటతోనూ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటంతో పాటలపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇక విజయదశమి రోజున ఈ మూవీ ట్రైలర్ రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ట్రైలర్తోపాటే సినిమా కొత్త విడుదల తేదీని కూడా ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.
అక్టోబర్ 30న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించగా, నారా రోహిత్, నివేదా పేతురాజ్, రావు రమేష్, సత్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై ఎస్. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
