
ఎక్స్ కాప్,ఎక్స్ గర్ల్ ఫ్రెండ్,ఎక్స్లెంట్ వైఫ్..అంటూ ఈ సారి ఎక్స్టార్డినరీ క్రైం థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు విక్టరీ వెంకీ. డైరెక్టర్ అనిల్ రావిపూడితో మరోసారి జతకట్టనున్న వెంకీ మామ..ఎంటర్టైన్మెంట్ లెవల్ పీక్స్ ఉండేలా సిద్ధమయ్యారు.ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ (SVC 58) నుంచి ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చేసింది.
తాజాగా వెంకీఅనిల్ 3ప్రాజెక్ట్ గురువారం (జూలై 11న) షూటింగ్ షురూ అయిందంటూ నిర్మాణ సంస్థ పోస్ట్ చేసింది.ఈ సినిమాలో నటించబోయే ప్రధాన తారాగణంతో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తూ వీడియో రిలీజ్ చేశారు."ఈ SVC 58 ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎంటర్టైన్మెంట్ ఫీస్ట్ అవుతుంది.త్వరలో ఈ ప్రాజెక్ట్ నుంచి మరిన్ని రానున్నాయి..ఎదురుచూస్తూ ఉండండి" అంటూ తెలిపారు.
క్రైమ్ యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో వెంకటేశ్ భార్యగా ఐశ్వర్య రాజేశ్,ప్రియురాలిగా మీనాక్షి చౌదరి కనిపించనున్నారు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తిచేసి..2025సంక్రాంతికి రిలీజ్ చేస్తాం’అని షూటింగ్ ప్రారంభోత్సం సందర్బంగా మేకర్స్ తెలిపారు.అయితే,ఈ సినిమాలో వెంకటేష్ మాజీ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది.
అంతేకాదు ఓవైపు భార్య మరోవైపు గర్ల్ ఫ్రెండ్..ఇద్దరి మధ్య నలిగిపోయే పాత్రలో వెంకటేష్ కనిపిస్తారని అంటున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమాకి 'నారి నారి నడుమ మురారి'అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. త్వరలోనే టైటిల్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేసే అవకాశం ఉంది.భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకోనుందో చూడాలి.
వెంకటేష్,దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో ఇప్పటికే F2,F3 సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే.ఫ్యామిలీ అండ్ కామెడి ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ రెండు సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.దిల్ రాజు నిర్మాణ సంస్థలో వచ్చిన ఈ రెండు సినిమాలు కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో రాబట్టాయి.అందుకే..వెంకీ,అనిల్ కాంబోలో సూపర్ హిట్ కాంబోగా మారింది.ఇప్పుడు మరోసారి ఈ కాబోలో తెరపైకి వస్తే ఎలా ఉంటుంది.ఎంటర్టైన్మెంట్ లెవల్ పీక్స్ ఉంటుంది కదా.
#VenkyAnil3 x #SVC58 SHOOT BEGINS ❤️?
— Sri Venkateswara Creations (@SVC_official) July 11, 2024
The team is filming key sequences with some of the main cast?
This will be a thrilling entertainment feast for the audience. Stay tuned for more updates ?❤️
SANKRANTHI 2025 RELEASE ??
Victory @VenkyMama @AnilRavipudi @Meenakshiioffl… pic.twitter.com/feUeyVsS1R