
వెంకీ అట్లూరి(Venky Atluri) డైరెక్షన్ లో దుల్కర్ సల్మాన్(Dulquer Slaman) హీరోగా లక్కీ భాస్కర్(Lucky Baskhar) టైటిల్ తో మూవీ రాబోతుంది. ఈ మూవీ పోస్టర్ లో.. దుల్కర్ తల చుట్టూ తిరుగుతున్న రూ.100 నోట్లను చూపిస్తూ..అమాంతం స్టోరీలైన్ ను చెప్పేసారు మేకర్స్. ఈ పోస్టర్తో ఫ్యాన్స్లో ఇంటెన్సివ్ వైబ్ పెరుగుతోంది.
లేటెస్ట్గా లక్కీబాస్కర్ మూవీ షూటింగ్ పూజా కార్యక్రమం మొదలైంది. ఈ ఈవెంట్లో డైరెక్టర్ వెంకీ, ప్రొడ్యూసర్స్ నాగవంశీ, హీరోయిన్ మీనాక్షి చౌదరి పాల్గోన్నారు. వీలైనంత తొందరలో ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసేలా ప్లాన్ చేశారంట డైరెక్టర్.
కాగా ఈ మూవీ పీరియాడికల్ జోనర్లో సాగుతూ..ఒక సామాన్యుడు..ఆ సామాన్యమైన విజయాలను ఎలా సాధించాడు..అందుకు అడ్డొచ్చిన అసమానతలు ఏంటనేది.. ఈ మూవీ స్టోరీ లైన్ అని టాక్ వినిపిస్తోంది. ఇక కరెన్సీ నేపథ్యంలో పాత్రల క్యారెక్టర్స్ చాలా కొత్తగా ఉంటాయని తెలుస్తోంది.
రీసెంట్గా స్టార్ ధనుష్తో..డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కించిన సార్ (తమిళ్‌లో ‘వాతి’) మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి స్టార్ డైరెక్టర్ హోదా తీసుకొచ్చింది. దీంతో డైరెక్టర్ వెంకీ అట్లూరి మంచి ఫామ్లో ఉన్నట్టు తెలుస్తోంది. మంచి కంటెంట్ను సెలెక్ట్ చేసుకునే దుల్కర్ సల్మాన్..ఈ మూవీతో మరో హిట్ కొట్టడం పక్కా అంటున్నారు ఫ్యాన్స్. దుల్కర్ సీతా రామం మూవీతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన విషయం తెలిసేందే.
An ordinary man has started his journey to Unscalable heights, Today! ?#LuckyBaskhar Shoot Begins with a pooja ceremony!✨?
— Sithara Entertainments (@SitharaEnts) September 24, 2023
A #VenkyAtluri directorial ?@dulQuer @gvprakash @Meenakshiioffl @vamsi84 @Banglan16034849 @NavinNooli #SaiSoujanya @SitharaEnts @Fortune4Cinemas… pic.twitter.com/XuWPuzwQxU