జ్యోతిష్యం: స్వాతి నక్షత్రంలోకి శుక్రుడి మాయాజాలం.. ఆరు రాశుల వారు పట్టింది బంగారమే..!

జ్యోతిష్యం:  స్వాతి నక్షత్రంలోకి శుక్రుడి మాయాజాలం.. ఆరు రాశుల వారు పట్టింది బంగారమే..!

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం నక్షత్రాలు.. గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాన్ని మార్చకుంటాయి.  ఈ నెలలో శుక్రుడి కదలికలో  మార్పులు ఉంటాయి. సెప్టెంబర్​ 2 న న తులారాశిలోకి ప్రవేశించిన శుక్రుడు ... సెప్టెంబర్​ 11  శుక్రవారం రాత్రి  11.19 గంటలకు  రాహువు   స్వాతి నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు .  దీని ప్రభావంతో కొన్ని రాశుల వారికి ఆరు రాశుల(మేషం.. వృషభ..మిథున...కన్య...  తుల.... కుంభం) వారికి అనుకూల ఫలితాలు కలిగి.. పట్టింది బంగారమే అయ్యే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  ఇప్పుడు ఆ రాశుల గురించి తెలుసుకుందాం. . .! 

మేషరాశి:  శుక్రుడు.. స్వాతి నక్షత్రంలో సంచారం వలన ఈ రాశి వారికి  ఎదురవుతున్న ఇబ్బందులు  తగ్గుతాయి.   అన్ని పనుల్లోనూ అదృష్టం కలిసి వస్తుంది.ఆర్థిక లావాదేవీలతో సహా అనేక మార్గాల్లో అదనపు ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది.ఊహించని విధంగా కొత్త అవకాశాలు అందివచ్చే అవకాశం ఉంది. పెద్ద ప్రాజెక్ట్‌ లేదా కీలకమైన అవకాశం ద్వారా ఆదాయం పెరగవచ్చు.  ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతులకు, జీతభత్యాల పెరుగుదలకు మార్గం సుగమం అవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలను మించుతుంది. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

వృషభ రాశి:  శుక్రుడు  రాహువుకు చెందిన స్వాతి  నక్షత్రంలో స్వాతి  సంచరించే సమయంలో ఈరాశి వారికి  అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ఈ కాలంలో జీవితంలో సానుకూల పరిస్థితులు పెరిగి, కొత్త ఆలోచనలు మనసులో ఉద్భవిస్తాయి. కొత్త పెట్టుబడులకు అనుకూలమైన సమయం ఇది, ఆర్థిక స్థితి బలపడుతుంది. దీర్ఘకాలం నుంచి ఉన్న అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కెరీర్‌లో పెద్ద టార్గెట్ సాధన లేదా మంచి వార్తలు వచ్చే అవకాశం ఉంది. ఇది ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. ఉద్యోగంలో హోదా పెరగడానికి, వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు వృద్ధి చెందడానికి అవకాశం ఉంది. కుటుంబంలో సమస్యలు, ఒత్తిళ్లు బాగా తగ్గి సుఖ సంతోషాలు పెరుగుతాయి. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి అందుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభిస్తుంది. బంధువర్గంలో మంచిపెళ్లి సంబంధం కుదురుతుంది.

మిథునరాశి:  శుక్రుడు .. స్వాతి నక్షత్రంలోకి ప్రవేశించడం వలన ఈ రాశి వారి  గోచారం అద్భుతమైన ఫలితాలు తీసుకువస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ అవకాశాలు వేచి చూస్తున్నాయి. సీనియర్ల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఇంటి వాతావరణం సంతోషకరంగా, ఉత్సాహంగా ఉంటుంది. భాగస్వామితో సమయం గడపడానికి అవకాశం ఏర్పడుతుంది.  దీర్ఘకాలం నుంచి ఉన్న వివాదాలు, తప్పుగా అర్థం చేసుకోవడాలూ, అపార్థాలూ తీరిపోతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆదాయ ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. 

ఉద్యోగంలో జీత భత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి వృద్ధి చెందుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఇంట్లో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. 

కన్యారాశి:  శుక్రుని నక్షత్ర మార్పు ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది.  రాహు నక్షత్రమైన స్వాతిలోకి ప్రవేశించడం ద్వారా   కొత్త మార్గాలను సృష్టిస్తాడు.  దీనివల్ల భౌతిక సుఖాలు పెరుగుతాయి.వారు కుటుంబం సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని  ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో  ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు.   ఎలాంటి రిస్క్ తీసుకోవడానికైనా ఆలోచించరు. కష్టమైన పరిస్థితులు వచ్చినప్పటికీ విజయాన్ని అందుకుంటారు. కుటుంబమంతా సంతోషంగా ఉండాలని, అందర్నీ కలపడం కోసం ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారు. ఆస్తి వివాదాలు అనుకోకుండా రాజీమార్గంలో పరిష్కారమై, బాగా లబ్ధి పొందుతారు. ఉద్యోగంలో సీనియర్లను కాదని పదోన్నతులు లభిస్తాయి.  గృహ యోగం పడుతుంది. వ్యాపారస్తులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త బ్రాంచీలు ప్రారంభించే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి.

►ALSO READ | సంతాన వ్రతం: ఆడపిల్లలు కావలా.. మగపిల్లలు కావాలా..చేయాల్సినపూజ.. నైవేద్యాలు ఇవే..!

తులారాశి: రాహువు స్వాతి నక్షత్రంలోకి శుక్రుడి ప్రవేశం వలన ఈ రాశి వారికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. వ్యాపార రంగంలో దూసుకుపోయే అవకాశం లభిస్తుంది. సమాజంలో మీ గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణకు ఇది సరైన సమయమని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. చాలాకాలంగా వేధిస్తున్న ఆస్తి వివాదాలు తొలగిపోయి, కొత్త స్థిరాస్తులు కొనుగోలు చేసేయోగం ఉంది. 

ఈ రాశివారికి ఈ కాలం అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయాలు మీ సొంతమవుతాయి. ఉద్యోగస్తులకు ఆఫీస్‌లో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి. పదోన్నతులు లేదా వేతన సవరణకు అవకాశం ఉంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు తలుపు తడతాయి.  కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఆర్థికంగా ఊహించని మార్పులు కనిపిస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

కుంభరాశి:  ఈ రాశి జాతకులకు రాహువుకు చెందిన స్వాతి నక్షత్రంలో శుక్రుడు సంచారం వలన  ఈ కాలం కాసుల వర్షం కురిపించనుంది. పెద్దగా శ్రమ పడకుండానే అకస్మాత్తుగా ధనలాభం కలుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు, ఇది కుటుంబంలో ఆనందాన్ని నింపుతుంది. దీర్ఘకాలిక పెట్టుబడులు మంచి లాభాలను అందిస్తాయి. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు  సులభంగా నెరవేరుతాయి.  అదృష్టం కూడా రెట్టింపు కాబోతోంది. వ్యాపారస్తులకు  బోలెడు లాభాలు  కలుగుతాయి.   ఉద్యోగస్తులకు హోదా పెరుగుతుంది.పెద్ద ప్రాజెక్ట్‌ లేదా కీలకమైన అవకాశం ద్వారా ఆదాయం పెరగవచ్చు. ప్రేమ, దాంపత్య జీవితంలోనూ భాగస్వామితో అనుబంధం మరింత బలపడే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.