హైదరాబాద్, వెలుగు: వృద్ధుల కోసం వెరా విటా లివింగ్ హైదరాబాద్‌లో ప్రీమియం సీనియర్ లివింగ్ కమ్యూనిటీ అమయ్‌ను ప్రారంభించింది. మూడు దశల్లో దీనిని నిర్మించడానికి రూ.600 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని తెలిపింది. రాబోయే ఐదేళ్లలో మరిన్ని నగరాలలో ఇలాంటి ప్రాజెక్ట్‌లను అభివృద్ధి చేస్తామని వెల్లడించింది. హైదరాబాద్‌లోని కండ్లకోయ రిజర్వ్ ఫారెస్ట్ దగ్గర ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తారు. ఇక్కడ నివసించే వారికి వైద్య సేవలు, వినోదం, భోజన వసతి, వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. మొదటి దశలో మూడు ఎకరాల విస్తీర్ణంలో 256 ఫ్లాట్లను నిర్మిస్తారు. వీటిలో 1, 2, 2.5, 3, 3.5 బెడ్ రూమ్స్ ఉంటాయి. విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై, కూనూర్, పుణె నగరాలలో కూడా తమ సేవలను విస్తరించాలని సంస్థ భావిస్తోంది.
