Madhoo: స్టార్ హీరోయిన్ మధుబాల ఇంట్లో పెళ్లి సందడి.. త్వరలో అత్తగా కొత్త ఇన్నింగ్స్!

Madhoo: స్టార్ హీరోయిన్ మధుబాల ఇంట్లో పెళ్లి సందడి.. త్వరలో అత్తగా కొత్త ఇన్నింగ్స్!

తన అందం, అభినయంతో ఒకప్పుడు తెలుగు, తమిళ, హిందీ సినీ ప్రేక్షకులను అలరించింది స్టార్ హీరోయిన్ మధుబాల (Madhoo  ). సెంకర్ ఇన్నింగ్ లో ప్రస్తుతం మళయాళంలో నటిస్తోంది. అయితే ఇప్పుడు ఆమె జీవితంలో మరో అందమైన అధ్యాయం ప్రారంభం కానుంది. త్వరలోనే ఆమె పెద్ద కుమార్తె అమయ వివాహ బంధంలో అడుగుపెట్టబోతోంది. ఇప్పటికే మధూ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది.. 

లేటెస్ట్ గా మధుబాలు ఓ ఇంటర్య్వూలో మాట్లాడూ .. నా పెద్ద కూతురు త్వరలో పెళ్లి చేసుకోబోతోందని వెళ్లడించింది. . ప్రస్తుతం ఆమెకు పని గురించి ఆలోచించే సమయమే లేదు. పెళ్లి సంబరాల ప్రపంచంలో విహరిస్తోంది అంటూ ఆనందాన్ని వ్యక్తం చేసింది. కుటుంబమంతా వివాహ ఏర్పాట్లలో బిజీగా ఉండగా, పెళ్లి కూతురు మాత్రం ఆనందంలో తేలిపోతోందని మధూ వెల్లడించింది.

ఇక తన చిన్న కుమార్తె కేయా గురించి కూడా ఆసక్తికర విషయాలు చెప్పింది. మొదట తల్లి బాటలో హీరోయిన్ కావాలని ప్రయత్నించిన కేయా.. కొంతకాలం నటనను పరిశీలించిన తర్వాత అది తనకు సరిపోదని నిర్ణయించుకుందట. ప్రస్తుతం తండ్రి ఆనంద్ షాతో కలిసి వ్యాపార రంగంలో శిక్షణ తీసుకుంటూ, భవిష్యత్తులో బిజినెస్‌లోనే తన కెరీర్‌ను నిర్మించుకోవాలని భావిస్తోందని మధూ తెలిపింది.

ఈ సందర్భంగా తన ప్రేమకథను గుర్తు చేసుకున్న మధూ చెప్పిన విషయం మరింత ఆసక్తిని కలిగించింది. 'దిల్‌జలే' సినిమా చూసిన తర్వాతే ఆనంద్ షా తనపై ఆకర్షితుడయ్యాడని తెలిపింది. తొలుత ఈ అమ్మాయి ఎవరు? అని ఆరా తీసి, ఆ పరిచయం చివరకు పెళ్లి వరకు వెళ్లిందని నవ్వుతూ చెప్పింది. ఒక సినిమా తన జీవిత భాగస్వామిని పరిచయం చేస్తుందని అప్పట్లో తాను ఊహించలేదని ఆమె పేర్కొంది.

మధూ 1999 ఫిబ్రవరి 19న ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ షాను వివాహం చేసుకుంది. ఆనంద్ షా, నటి జూహీ చావ్లా భర్త జయ్ మెహతాకు బంధువు .. ప్రస్తుతం సినిమాలతో పాటు కుటుంబ బాధ్యతలను సమతుల్యం చేస్తూ సాగుతున్న మధుబాల.. త్వరలో అత్తగా కొత్త పాత్రలోకి అడుగుపెట్టేందుకు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తోంది. అభిమానులు కూడా ఆమె కుటుంబంలో జరగబోయే ఈ శుభకార్యానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.