దక్షిణాది సినీ సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు, గాయకుడు దేవా (75) కన్నుమూశారు. ‘తెనిసై తెండ్రల్-మధుర సంగీత సమీరం’గా అభిమానులు ప్రేమగా పిలుచుకునే దేవా.. ఇవాళ శనివారం (అక్టోబర్ 17) చెన్నైలో తుదిశ్వాస విడిచినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. ఉదయం సుమారు 8.30 గంటల సమయంలో ఆయనను చెన్నైలోని సూర్య ఆసుపత్రికి తీసుకెళ్లగా, అక్కడే గుండెపోటుతో హఠాత్తుగా మరణించినట్లు సమాచారం.
బాషా, ఖుషి, తొలిప్రేమ సినిమాలతో చెరగని ముద్ర..
దేవా మరణవార్తతో సినీ సంగీత అభిమానుల్లో విషాదం నెలకొంది. దశాబ్దాల పాటు తన బాణీలతో ప్రేక్షకులను అలరించిన ఈ సంగీత దిగ్గజం ఇక లేరన్న వార్త అభిమానులను కలచివేస్తోంది. ఆయన స్వరపరిచిన పాటలు, హుషారెత్తించే బాణీలు, హృదయాన్ని తాకే మెలోడీలు సంగీత ప్రియుల జ్ఞాపకాల్లో చిరస్థాయిగా నిలిచిపోనున్నాయి. మూడు దశాబ్దాలకు పైగా సాగిన సినీ ప్రస్థానంలో వందలాది చిత్రాలకు సంగీతం అందించిన దేవా.. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ చిత్రసీమల్లోనూ పనిచేశారు.
తెలుగులో తొలిప్రేమ, మాస్టర్, ‘బాషా’, ‘నాగ’ వంటి సక్సెస్ ఫుల్ సినిమాలకు సంగీతం అందించారు. దేవా మరణంతో దక్షిణాది చిత్రసంగీతం ఒక గొప్ప కళాకారుడిని కోల్పోయింది. ఈ క్రమంలోనే సినీ స్టార్స్, సంగీత అభిమానులు సోషల్ మీడియా వేదికగా కన్నీటి నివాళులు అర్పిస్తున్నారు.
దేవా మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటు: గవర్నర్ సంతాపం
దేవా మరణంపై తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన మధురమైన బాణీలతో తరతరాల ప్రేక్షకుల హృదయాల్లో దేవా చెరగని ముద్ర వేశారని కొనియాడారు. ఆయన మరణం తమిళ సినీ సంగీతానికి తీరని లోటని పేర్కొంటూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Thiru. Rajendra Vishwanath Arlekar, Hon’ble Governor of Tamil Nadu, expresses his profound grief over the demise of renowned music director Deva, whose remarkable contribution to Tamil film music enriched the cultural landscape of Tamil Nadu. Through his memorable compositions, melodious tunes and distinctive musical style, Deva earned a special place in the hearts of millions of music lovers. His music transcended generations and left an enduring imprint on Tamil cinema. His passing is an irreparable loss to the world of music and Tamil cinema. The Hon’ble Governor conveys his heartfelt condolences to the bereaved family, colleagues and countless admirers, and prays for the departed soul to attain eternal peace. #Condolences #MusicDirectorDeva #RIPDeva #TamilCinema #TamilMusic #LokBhavanTamilNadu #GovernorOfTamilNadu
— LOK BHAVAN, TAMIL NADU (@lokbhavan_tn) October 17, 2026
