ప్రముఖ తమిళ దర్శకుడు పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘వెట్టువం’. శతాబ్దాల నాటి భారతీయ సంప్రదాయ క్రీడ మల్లఖంబం నేపథ్యంలో తనే నిర్మాతగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఆర్య, శోభితా ధూళిపాళ్ల, వి.ఆర్. దినేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన వీడియో గ్లింప్స్‌కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలోని ఓ కీలకపాత్రకు శ్రుతిహాసన్‌ను ఎంపిక చేసినట్టు తాజా సమాచారం.
దాదాపు మూడు రోజుల పాటు ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొంటుంది శ్రుతిహాసన్. అంతేకాదు.. రెమ్యునరేషన్ కూడా తీసుకోకుండా ఉచితంగా ఇందులో ఆమె నటిస్తోందని తెలుస్తోంది. దర్శకుడిపై ఉన్న అభిమానంతోనే ఆమె ఇందులో ఉచితంగా నటిస్తోందట. తన పాత్రతోనే ఈ సినిమా కథ మొదలవుతుందని, ఓ నెరేటర్‌లా కథను ముందుకు తీసుకెళ్లే పాత్రలో ఆమె కనిపించబోతోందని సమాచారం. తనతో పాటు దుల్కర్ సల్మాన్ కూడా ఇందులో గెస్ట్ రోల్ చేస్తున్నాడట. ఇద్దరి పాత్రల నిడివి తక్కువైనా ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేసేలా ఉంటాయని కోలీవుడ్ టాక్. మరోవైపు దుల్కర్ సల్మాన్ సినిమా ‘ఆకాశంలో ఒక తార’లో శ్రుతిహాసన్ కీలకపాత్ర పోషించగా, నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
