స్పై యూనివర్స్‌‌‌‌లో..విక్కీ కౌశల్

స్పై యూనివర్స్‌‌‌‌లో..విక్కీ కౌశల్

‘ఛావా’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న విక్కీ కౌశల్.. ఓ క్రేజీ ప్రాజెక్ట్‌‌‌‌లో జాయిన్ అవబోతున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్‌‌‌‌ తెరకెక్కించబోయే చిత్రంలో అతను నటించబోతున్నట్టు తెలుస్తోంది. సల్మాన్ ఖాన్,  షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్ లాంటి బాలీవుడ్ స్టార్స్‌‌‌‌ను రా ఏజెంట్స్‌‌‌‌గా ప్రజెంట్‌‌‌‌ చేస్తూ ఓ స్పై యూనివర్స్‌‌‌‌ను క్రియేట్ చేసిన యశ్ రాజ్ ఫిల్మ్స్‌‌‌‌.. తాజాగా ‘వార్‌‌‌‌‌‌‌‌ 2’ సినిమాతో ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌ను ఈ యూనివర్స్‌‌‌‌లో భాగం చేసింది. 

ఇప్పుడు ఈ ఫ్రాంచైజీలో మరో హై యాక్షన్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌ తెరకెక్కించబోతున్న  నిర్మాత ఆదిత్య చోప్రా.. విక్కీ కౌశల్‌‌‌‌ను ఇందులోకి తీసుకునే ప్లాన్‌‌‌‌లో ఉన్నారట. ఇందుకోసం ఇప్పటికే విక్కీతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.  తను కూడా ఈ ఫ్రాంచైజీలో జాయిన్ అయ్యేందుకు ఆసక్తి చూపిస్తున్నాడని తెలుస్తోంది. బాలీవుడ్‌‌‌‌లో మోస్ట్‌‌‌‌ సక్సెస్‌‌‌‌ఫుల్‌‌‌‌ అయిన ఈ ఫ్రాంచైజీలో విక్కీ ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నాడా అనే ఆసక్తి నెలకొంది.