AK47 Release Date Official: వెంకీ మామ దసరా గిఫ్ట్.. 'ఆదర్శ కుటుంబం' రిలీజ్ డేట్ ఫిక్స్!

AK47 Release Date Official: వెంకీ మామ దసరా గిఫ్ట్.. 'ఆదర్శ కుటుంబం' రిలీజ్ డేట్ ఫిక్స్!

టాలీవుడ్‌లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన విక్టరీ వెంకటేష్ మరోసారి బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47' (  AK47 ) ఎట్టకేలకు విడుదల తేదీని ఖరారు చేసుకుంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు దసరా పండుగ వేళ మేకర్స్ అదిరిపోయే అప్‌డేట్ అందించారు. ఈ నెల 30న ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు వెంకటేష్ స్వయంగా ప్రకటించారు.

ఆసక్తి పెంచుతున్న కాంబినేషన్..

వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత శ్రీనుతో కలిసి పనిచేయడం ఎంతో ప్రత్యేకమని వెంకటేష్ పేర్కొన్నారు. వినోదం, యాక్షన్‌తో పాటు కుటుంబమంతా కలిసి ఆస్వాదించగల సంపూర్ణ వినోదాన్ని అందించబోతున్నామని తన ఎక్స్‌ ఖాతా ద్వారా వెల్లడించారు. అక్టోబర్ 30న 'ఆదర్శ కుటుంబం', స్నేహితులతో కలిసి థియేటర్లలో కలుద్దామని అభిమానులను ఆహ్వానించారు.

 

సెకండ్ సాంగ్‌తో పెరిగిన హైప్..

ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన 'నారాయణమ్మ' ఫోక్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. లేటెస్ట్ గా విడుదలైన రెండో పాట 'మాల వచ్చా చూడు'  కూడా ఆసక్తిని పెంచుతోంది. థమన్ స్వరపరిచిన ఈ పాటను ధనుంజయ్ సీపాన, రణినా రెడ్డి ఆలపించారు. రామజోగయ్య శాస్త్రి అందించిన క్యాచీ లిరిక్స్‌కు భాను మాస్టర్ కొరియోగ్రఫీలో వెంకటేష్, నివేదా పేతురాజ్ చేసిన డ్యాన్స్ మూమెంట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తుండగా, నారా రోహిత్, రావు రమేష్, సత్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.

విడుదల తేదీ ఖరారు కావడంతో ఇప్పుడు అభిమానుల దృష్టి ట్రైలర్‌పై పడింది. కుటుంబ బంధాలు, వినోదం, యాక్షన్ కలగలిపిన ఈ చిత్రం వెంకటేష్‌కు మరో విజయాన్ని అందిస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. దసరా సందర్భంగా వచ్చిన ఈ ప్రకటనతో 'ఆదర్శ కుటుంబం'పై అంచనాలు మరింత పెరిగాయి.