విక్టరీ వెంకటేష్ క్రేజీ లైనప్‌‌‌‌‌‌‌‌.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీ

విక్టరీ వెంకటేష్ క్రేజీ లైనప్‌‌‌‌‌‌‌‌.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీ

ఈ ఏడాది ప్రారంభంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్‌‌‌‌‌‌‌‌ను అందుకున్న వెంకటేష్.. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతోన్న చిత్రంలో ఆయన కీలక పాత్ర  పోషిస్తున్నారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో జరుగుతున్న ఈ మూవీ షూటింగ్‌‌‌‌‌‌‌‌లో ఇటీవల వెంకటేష్ జాయిన్ అయ్యారని తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఒక నెల మొత్తం బల్క్ డేట్స్ ఇచ్చారనే టాక్ వినిపిస్తోంది. ఆయన పాత్రకు ఓ ప్రత్యేకత ఉంటుందని, సినిమాను మలుపు తిప్పేలా వెంకీ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను డిజైన్ చేశాడట అనిల్ రావిపూడి. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానుంది.  మరోవైపు ఇది పూర్తవగానే త్రివిక్రమ్ డైరెక్షన్‌‌‌‌‌‌‌‌లో నటించేందుకు వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఆగస్టు నుంచి  ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌‌‌‌‌‌‌‌ను స్టార్ట్ చేయనున్నారు. ఫ్యామిలీ జానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వెంకటేష్  మార్క్‌‌‌‌‌‌‌‌ కామెడీని జోడించి  త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. అలాగే  ఈ ఏడాదిలోనే   ‘దృశ్యం3’ కూడా మొదలుపెట్టేలా ప్లాన్ చేస్తున్నారు వెంకటేష్. ఈ చిత్రాన్ని మలయాళంతోపాటు తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి చిత్రీకరించేలా మేకర్స్  రెడీ అవుతుండగా, ఈలోపు ఆయన చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేయాలనుకుంటున్నారు.  ఇలా బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్టులతో బిజీ అయిన వెంకీ లైనప్ చూసి ఆయన ఫ్యాన్స్ ఫుల్ జోష్‌‌‌‌‌‌‌‌లో ఉన్నారు.