చదువును ఎవరూ లాగేసుకోలేరు చిన్నప్ప

చదువును ఎవరూ లాగేసుకోలేరు చిన్నప్ప

శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన సినిమా నారప్ప. వెంకీకి జోడీగా ప్రియమణి నటించిన ఈ సినిమా జూలై 20న అమెజాన్‌ ప్రైమ్‌ లో విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రిలీజైన నారప్ప సాంగ్స్ ఆకట్టుకుంటుండగా బుధవారం ఈ సినిమా ట్రైలర్‌ ను రిలీజ్ చేసింది యూనిట్‌. రాయలసీమ బ్యాక్‌ డ్రాప్‌ లో సాగే ఈ మూవీలో వెంకటేశ్‌ యువకుడిగా, మధ్య వయస్కుడిగా.. ఇద్దరు పిల్లల తండ్రి పాత్రలో నటించినట్లు తెలుస్తుంది. ప్రియమణి ఓ హీరోయిన్‌ కాగా.. ఫ్లాష్‌ బ్యాక్‌ లో మరో హీరోయిన్‌ కనిపిస్తుంది. రావు రమేశ్‌, నాజర్‌, రాజీవ్‌ కనకాల ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. సురేష్‌ బాబు, కలైపులి ఎస్‌. థాను నిర్మాతలు. ట్రైలర్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఆకట్టుకోగా.. మంచి డైలాగ్స్ ఉన్నాయి. మన దగ్గర డబ్బు, భూమి ఉంటే లాగేసుకుంటారు. కానీ చదువును ఎవరూ లాగేసుకోలేరు చిన్నప్ప అంటూ చివర్లో వెంకటేశ్‌ చెప్పే డైలాగ్‌ బాగుంది. ఆకట్టుకుంటోంది. భూ తగాదాలు, కుల వ్యవస్థ తదితర అంశాలను ఆధారంగా చేసుకుని రూపొందిన ఈ సినిమాలో వెంకటేశ్‌ తనదైన నటనతో మరోసారి ఆకట్టుకుంటున్నాడు.