Victory Venkatesh: వియ్యంకుడి విజయం కోసం ఖమ్మం ప్రచారంలో భాగంకానున్న వెంకీ మామ

Victory Venkatesh: వియ్యంకుడి విజయం కోసం ఖమ్మం ప్రచారంలో భాగంకానున్న వెంకీ మామ

విక్టరీ వెంకటేష్(Victory Venkatesh)..టాలీవుడ్ లో ఈ పేరు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరంలేదు. తనదైన నటనతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు ఈ సీనియర్ హీరో.నిజం చెప్పాలంటే..ఏ ఇండస్ట్రీలోనైనా స్టార్ హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు కానీ..అందరి హీరోల ఫ్యాన్స్ కు నచ్చే ఏకైక హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది వెంకటేష్ అనే చెప్పాలి.

గొప్ప కుటుంబం నుండి వచ్చినా..ఆ గర్వం ఎక్కడా చూపించకుండా చాలా సాధారణంగా ఉండటం ఆయన నైజం. అందుకే ప్రతీఒక్కరు ఆయనని ఇష్టపడతారు.ప్రస్తుతం తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. తెలంగాణలో మొత్తం 17 స్థానాలకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో నిలబడిన నాయకులు హొరాహొరిన పాల్గొంటున్నారు. 

తాజా సమాచారం ప్రకారం..ఇవాళ  మంగళవారం విక్టరీ వెంకటేష్ ఖమ్మంలో తన వియ్యంకుడు రఘురాంరెడ్డి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నట్లు సమాచారం. ఇప్పటికే మరోవైపు వెంకటేష్ కూతురు, రఘురామ్ రెడ్డి కోడలు జోరుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. మామను గెలిపించాలని కోరుతూ తనదైన పంథాలో ఇంటింటికి ప్రచారం చేస్తు బిజీగా ఉన్నారు.

అయితే,విక్టరీ వెంకటేష్ కుమార్తె ఆశ్రీతను రఘురాంరెడ్డి పెద్ద కుమారుడికి ఇచ్చి వివాహం చేసిన విషయం తెలిసిందే. ఇక చిన్న కుమారుడికి మంత్రి పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి బిడ్డను ఇచ్చారు.దీంతో వెంకటేష్,మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు వియ్యంకుడి విజయం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు.  జూన్ 4న లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.