పప్పు, మామిడి కాయ పచ్చడి.. వీటికి తోడు అప్పడాలు. భలే కాంబినేషన్ కదా. పప్పు ఒక్కటే కాదు.. కూరలు ఏవైనా పాపడా లేకుండా భోజనం చేయరు కొందరు. అంత రుచిగా ఉంటూ ఓ రెండు ముద్దలు ఎక్కువగా లగాయించేలా ఉంటాయి అప్పడాలు. అలాంటి పాపడాల తయారీ ఇంత దారుణంగా ఉంటుందా అని తెలిసి వ్యాక్ అనాల్సి వస్తుందంటున్నారు నెటిజన్లు. సోషల్ మీడియాలో ఒక కంపెనీకి చెందిన పాపడా వీడియో వైరల్ గా మారింది.
జాగ్రత్తగా ఉండండి.. మీ ఆహారం మీరు ఎక్కడ కొంటారు అంటూ ఎక్స్ లో వీడియో పోస్ట్ చేశారు. ఇది ఇప్పుడు వైరల్ గా మారింది. అప్పుడే విప్పిన ప్యాకెట్లో నుంచి తీసిన పాపడాపై కాలు ముద్రలు ఉండటం యూజర్లను షాకింగ్ కు గురిచేసింది. చూడండి పాపడా తయారీలో ఎంత హైజీనిక్ గా వ్యవహరిస్తున్నారో.. అంటూ వీడియో చూపిస్తూ పోస్ట్ చేశారు.
వీడియోలో చూపిస్తున్నట్లుగా పశుపతి అనే కంపెనీకి చెందిన పాపడాలు అవి. ఇది నేపాల్ కు చెందిన కంపెనీగా చెబుతున్నారు. అయితే ఆ కంపెనీ బ్రాండ్ తో ఇండియాలో సంజనీ అనే ఫుడ్ కంపెనీ ప్యాకేజింగ్ చేసి అమ్ముతన్నట్లు చెబుతున్నారు. సౌత్ ఆసియాలో ముఖ్యంగా నేపాల్, ఇండియా, బంగ్లా, ఇండోనేషియా తదితర దేశాల్లో ఈ పాపడాలను విరివిగా అమ్ముతుంటారు. పరిశుభ్రత విషయంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఏ వస్తువు కొన్నా కల్తీ భయంతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. పరిశుభ్రత పాటిస్తున్నామని చెబుతూనే కంపెనీలు దారుణంగా ఆహార పదార్థాలను తయారు చేస్తున్నాయి. ఇవన్నీ చూసి చాలా మంది బయట తగ్గించి ఇంట్లో స్వయంగా వండుకునే పరిస్థితి వచ్చింది. ఇలాంటి ఘటనలు చూసినప్పుడు బయట తినటం అవసరమా అని అనుకోక తప్పదు.
పాపడ్ కాదు.. ఫూట్ పడ్.. నెటిజన్స్ కామెంట్స్:
ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్లు.. అందుకే పాపడ్స్ బయట కొనటం మానేశాం.. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాం అని కామెంట్స్ చేస్తున్నారు. కంపెనీ నేపాల్ ది అయినా.. తయారీ, ప్యాకింగ్ఇండియాలోనే కదా.. ఇండియన్స్ స్పెషల్ ప్యాకేజింగ్ ఇది అంటూ రిప్లై ఇస్తున్నారు.
అది అంత హైజీన్ గా ఉందంటే కచ్చితంగా ఇండియన్సే తయారు చేసి ఉంటారని కిందరు కామెంట్ చేస్తున్నారు. అది అప్పడమా లేక శాసనాలపై ఉన్న ముద్రలా..? అంటూ కామెడీ చేస్తున్నారు. పాపడ్ కాదు.. ఫూట్ పడ్ అని పేరు మార్చాలని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
Be careful where you purchase your food 😬 pic.twitter.com/Cf0oA0U0eS
— 🤍 𝕂𝕚𝕥𝕥𝕖𝕟 🤍 (@Kittenwaffin) September 7, 2026
